
Nimisha Priya: యెమెన్‌లో భారతీయ నర్స్‌కు మరణ శిక్ష
ఈ వార్తాకథనం ఏంటి
యెమెన్ జాతీయుడిని హత్య చేసిన కేసులో 2017 నుండి జైలు శిక్ష అనుభవిస్తున్న భారతీయ నర్సు నిమిషా ప్రియ మరణశిక్షపై అప్పీల్‌ను యెమెన్ సుప్రీంకోర్టు తిరస్కరించింది.
తలాల్ అబ్దో మహదీని చంపిన కేసులో ప్రియా దోషిగా తేలింది. ఆమెకు 2018లో యెమెన్ తలాల్ అబ్దో మహదీలోని ట్రయల్ కోర్టు మరణశిక్ష విధించింది.
అప్పటి నుండి ఆమె విడుదల కోసం ఆమె కుటుంబం పోరాడుతోంది. యెమినీ సుప్రీంకోర్టు ఆమె అప్పీల్‌ను తిరస్కరించడంతో, ఇప్పుడు ఆ పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత దేశ రాష్ట్రపతికి ఉంది.
భారత ప్రభుత్వానికి ఈ విషయం తెలుసునని, అవసరమైనప్పుడు కాన్సులర్ సహాయాన్ని అందజేస్తోందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు.
Details
నిమిషా ప్రియ ఎవరు?
నిమిషా ప్రియది కేరళలోని పాలక్కాడ్ జిల్లా. నర్సింగ్ శిక్షణ కార్యక్రమం పూర్తి చేసిన తర్వాత, ఆమె యెమెన్ లో కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో పని చేసింది.
ప్రియకి 2014లో తలాల్ అబ్దో మహదీతో పరిచయం ఏర్పడింది. అతను స్వంత క్లినిక్‌ని ప్రారంభించడంలో ఆమెకు సహాయం చేస్తానని హామీ ఇచ్చాడు.
యెమెన్ చట్టం ప్రకారం, ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించడానికి స్థానికుడితో భాగస్వామ్యం తప్పనిసరి.
అయితే, ప్రియా,మహదీ మధ్య విభేదాల కారణంగా వారి భాగస్వామ్యం తొందరగానే ముగిసింది. ఆమె 2015లో మహదీతో కలిసి తన క్లినిక్‌ని ప్రారంభించింది.
అయితే స్థానిక అవుట్‌లెట్‌ల ప్రకారం, మహదీ ప్రియను బెదిరించడం ప్రారంభించాడు.
ఆమె యెమెన్‌ను విడిచి వెళ్లకుండా మహదీ ఆమె పాస్‌పోర్ట్‌ను కూడా తనే దగ్గరే ఉంచుకున్నాడు.
Details
పాస్‌పోర్ట్‌ను తిరిగి పొందే ప్రయత్నంలో మత్తుమందులను ఇంజెక్ట్ చేసిన ప్రియా
మహదీపై ప్రియా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాని కారణంగా 2016లో అతన్ని అరెస్టు చేశారు.
కానీ విడుదలైన తర్వాత కూడా అతను ప్రియను ఇబ్బందులు గురిచేస్తూనే ఉన్నాడు.
ఆ తర్వాత, 2017లో, అతని వద్ద నుండి తన పాస్‌పోర్ట్‌ను తిరిగి పొందే ప్రయత్నంలో ఆమె అతనికి మత్తుమందులను ఇంజెక్ట్ చేసింది.
అయితే ఆ మత్తుమందు ఓవర్ డోస్ అవ్వడంతో అతను చనిపోయాడు. 2018లో జరిగిన హత్యకేసులో ప్రియా దోషిగా తేలడంతో కోర్టు ఆమెకు మరణశిక్ష విధించింది.
Details
ఆమె కుటుంబం ఏం చేస్తోంది?
ప్రియా కుటుంబం 2018 నుండి ఆమెకు న్యాయం చేయాలని పోరాడుతోంది.భారతీయ పౌరులకు ప్రయాణ నిషేధం ఉన్నప్పటికీ యెమెన్‌కు వెళ్లడానికి అనుమతి కోరుతూ ఆమె తల్లి ఈ సంవత్సరం ప్రారంభంలో హైకోర్టును ఆశ్రయించింది.
తన కుమార్తెను రక్షించడం కోసం"బ్లడ్ మనీ"గురించి చర్చలు కూడా జరిపింది.బ్లడ్ మనీ అనేది నేరస్థుడు లేదా అతని కుటుంబం బాధితురాలికి లేదా వారి బంధువులకు చెల్లించే పరిహారాన్ని సూచిస్తుంది.
కేంద్రం న్యాయవాది ఇటీవల జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం,ప్రయాణ నిషేధాన్ని సడలించవచ్చు లేదా నిర్దిష్ట కారణాలు,వ్యవధి కోసం భారతీయ పౌరులు యెమెన్‌కు ప్రయాణించడాని కూడా అనుమతించవచ్చు.
ప్రియాను రక్షించేందుకు బ్లడ్ మనీ చెల్లింపుపై చర్చలు జరపాలని కేంద్రాన్ని ఆదేశించేందుకు హైకోర్టు గతంలో నిరాకరించి యెమెన్‌లో చట్టపరమైన పరిష్కారాలను కొనసాగించాలని కోరింది.