Nithyananda:నిత్యానంద కైలాస దేశంతో పరాగ్వే అధికారి ఒప్పందం.. పదవి గోవిందా
ఈ వార్తాకథనం ఏంటి
వివాదాస్పద స్వామిజీ నిత్యానంద స్థాపించిన 'యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస'తో ఒప్పందం చేసుకున్న కారణంగా పరాగ్వే కీలక అధికారి తన పదవి పొగొట్టుకున్నారు. ఈ మేరకు రాజీనామా చేయాల్సి వచ్చింది.
ఇదే తరహాలో నిత్యానంద దక్షిణ అమెరికాలోని పలువురు ప్రభుత్వాధికారులను తప్పుదోవపట్టించారని తెలుస్తోంది.
ఈఏడాది మొదట్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస ప్రతినిధులు జెనీవాలో నిర్వహించిన UNO సమావేశాలకు హాజరయ్యారు.
కైలాసతో దౌత్యసంబంధాల ఏర్పాటుకు కృషి చేస్తానని,అంతర్జాతీయ వేదికలపై కైలాస దేశ సార్వభౌమత్వానికి గుర్తింపు లభించేలా మద్దతు ఇస్తామని పరాగ్వే తరఫున ఆ అధికారి సంతకం చేశారు.
వ్యవసాయ మంత్రిత్వశాఖలోని ముఖ్యఅధికారి అర్నాల్డో చమర్రో సదరు ప్రకటనపై ఒప్పందం చేసుకోవడంతో ఆ దేశంలో దుమారం రేగింది.దీంతో అర్నాల్డో(Arnaldo Chamorro)తన పదవికి రాజీనామా చేశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
పరాగ్వే ఉన్నతాధికారి పదవి ఊస్ట్
#Paraguay replaces official who signed deal with #Nithyananda's fictional countryhttps://t.co/jY0w8ubnB5 pic.twitter.com/DgeSqQ6QhV
— Hindustan Times (@htTweets) December 1, 2023