LOADING...
Pakistan: పాపం పాకిస్థాన్.. ఫలితం ఇవ్వని దౌత్య చర్చలు.. తడిసి మోపెడైన హోటల్ బిల్లులు
పాపం పాకిస్థాన్.. ఫలితం ఇవ్వని దౌత్య చర్చలు.. తడిసి మోపెడైన హోటల్ బిల్లులు

Pakistan: పాపం పాకిస్థాన్.. ఫలితం ఇవ్వని దౌత్య చర్చలు.. తడిసి మోపెడైన హోటల్ బిల్లులు

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 14, 2026
04:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా-ఇరాన్ దేశాల మధ్య జరిగిన చర్చలకు మధ్యవర్తిత్వం చేపట్టిన పాకిస్థాన్ మరోసారి వార్తల్లో నిలిచింది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఆ దేశం, చర్చల ఫలితంతో సంబంధం లేకుండా ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన పలు మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. పశ్చిమ ఆసియా ప్రాంతంలో నెలకొన్న ఘర్షణలకు ముగింపు పలికి, అంతర్జాతీయ వేదికపై గుర్తింపు పొందాలని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో అమెరికా-ఇరాన్ దేశాల మధ్య శాంతి చర్చలకు ఆతిథ్యం ఇచ్చింది. రాజధాని ఇస్లామాబాద్లోని సెరెనా హోటల్ వేదికగా ఈ సమావేశాలు జరిగాయి.

వివరాలు 

బిల్లులను చెల్లించడంలో పాక్ ప్రభుత్వం విఫలం 

అమెరికా, ఇరాన్ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రతినిధులు పాల్గొన్నారు. అయితే ఈ చర్చలు ఫలితం ఇవ్వకపోయినా, హోటల్ ఖర్చులు మాత్రం భారీగా పెరిగినట్టు నిఘా వర్గాలు తెలిపాయి. ఆ బిల్లులను చెల్లించడంలో పాక్ ప్రభుత్వం విఫలమైందని సమాచారం. పరిస్థితిని చక్కదిద్దేందుకు హోటల్ యాజమాన్యం స్వయంగా జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని కథనాలు పేర్కొన్నాయి. రెండు దేశాలకు ఆతిథ్యం ఇచ్చిన సందర్భంలో వచ్చే సాధారణ ఖర్చులను కూడా చెల్లించలేకపోవడం పాక్ ఆర్థిక స్థితిని స్పష్టంగా చూపిస్తోంది. ఒకవైపు దౌత్యపరమైన ఆశయాలు, మరోవైపు దేశంలో నెలకొన్న ఆర్థిక అస్థిరత మధ్య విరుద్ధ పరిస్థితి ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

వివరాలు 

అమెరికా-ఇరాన్ దేశాల మధ్య మరో విడత చర్చలు

ప్రస్తుతం ఆర్థిక ఒత్తిడిని తట్టుకోవడానికి పాకిస్థాన్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సహాయాన్ని ఆశ్రయించింది. దేశంలో ధరల పెరుగుదల కూడా ఏడు నుంచి తొమ్మిది శాతం మధ్య కొనసాగుతోంది. ఈ పరిస్థితుల మధ్య అమెరికా-ఇరాన్ దేశాల మధ్య మరో విడత చర్చలు జరగనున్నాయి. ఏప్రిల్ 21తో రెండు వారాల కాల్పుల విరమణ ముగియనుండగా, ఆలోపు ఈ చర్చలు జరిగే అవకాశం ఉందని సమాచారం.

Advertisement