
మహిళల అణచివేతపై గళం విప్పిన పోరాటయోధురాలికి నోబెల్ శాంతి బహుమతి
ఈ వార్తాకథనం ఏంటి
ఈ ఏడాది ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతికి ఇరాన్ మానవ హక్కుల ఉద్యమకారిణి నర్గీస్ మహమ్మది ఎంపికయ్యారు.
ఇరాన్‌లో మహిళల అణచివేతకు వ్యతిరేకంగా ఆమె గళం విప్పింది. ఈ పోరాటానికి గానూ ఆమె నోబెల్ శాంతి అవార్డును అందజేస్తున్నట్లు నార్వే నోబెల్ కమిటీ ప్రకటించింది.
గత కొన్ని రోజులుగా వివిధ రంగాల్లో నోబెల్ అవార్డులను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే.
మానవ హక్కులు, ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛ కోసం గత కొన్నేళ్లుగా నార్గిస్ పోరాటం చేస్తోంది. ప్రస్తుతం అమె జైల్లో ఉన్నారు.
నార్గిస్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత కొన్ని రోజులు వార్తపత్రికల్లో కాలమిస్ట్‌గా పనిచేసింది.
Details
13 సార్లు అరెస్టు అయిన నార్గెస్
హక్కుల కోసం పోరాడుతున్న సమయంలో నార్గిస్ 13 సార్లు అరెస్టయ్యారు. ఐదుసార్లు జైలు శిక్షలను ఎదుర్కొన్నారు.
1998 ఇరాన్ ప్రభుత్వాన్ని విమర్శించినందుకు తొలిసారి అరెస్టెయి ఏడాదిపాటు జైలుశిక్షను అనుభవించింది.
తర్వాత డీహెచ్ఆర్‌సీలో చేరడంతో ఆమె మరోసారి అరెస్టు అయింది.
ఇరాన్‌లో రాజకీయ ఖైదీలు, మహిళల పట్ల జరుగుతున్న లైంగిక హింసకు వ్యతిరేకంగా నార్గిస్ జైల్లోనే ఉద్యమాన్ని ప్రారంభించారు.
ఇక 2022 సెప్టెంబరులో హిజాబ్ ధరించనందుకు మాసా పోలీసుల కస్టడీలో గాయపడి మరణించింది.
ఆ సమయంలో నార్గిస్ చేసిన ఉద్యమం ఇప్పటికీ గుర్తిండిపోయింది. ఆమె రాసిన కథనాలు న్యూయార్క్ టైమ్స్, బీబీసీ వంటి పత్రికల్లో వచ్చాయి.