ఉత్తర చిలీలో 6.2 తీవ్రతతో భూకంపం
ఉత్తర చిలీలో బుధవారం 6.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు తెలియరాలేదని అధికారులు చెప్పారు. U.S. జియోలాజికల్ సర్వే ప్రకారం, భూకంపం స్థానిక కాలమానం ప్రకారం 20:48 (00:48 GMT)కి నమోదైంది. దాని కేంద్రం చిలీలోని కోక్వింబోకు నైరుతి దిశలో 41 కిలోమీటర్లు (25 మైళ్ళు) దూరంలో ఉంది.రాత్రివేళ భూమి కంపించడంతో ప్రజలు ఇండ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. చిలీని "రింగ్ ఆఫ్ ఫైర్" అని పిలుస్తారు. అందుకే ఈ ప్రాంతంలో తరచుగా భూకంపాలు సంభవిస్తాయి . 2010లో 8.8 తీవ్రతతో సంభవించిన భూకంపం, ఆ తర్వాత వచ్చిన సునామీ వల్ల 526 మంది ప్రాణాలు కోల్పోయారు.