Page Loader
పాకిస్థాన్‌లో దారుణం.. 45మంది ఉపాధ్యాయురాళ్లపై ప్రిన్సిపాల్ అత్యాచారం 
పాకిస్థాన్‌లో దారుణం.. 45మంది ఉపాధ్యాయురాళ్లపై ప్రిన్సిపాల్ అత్యాచారం

పాకిస్థాన్‌లో దారుణం.. 45మంది ఉపాధ్యాయురాళ్లపై ప్రిన్సిపాల్ అత్యాచారం 

వ్రాసిన వారు Stalin
Sep 06, 2023
06:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

విద్యార్థులకు పాఠాలు చెప్పి వారిని సన్మార్గంలో నపడించాల్సిన ఉపాధ్యాయుడు కామాంధుడయ్యాడు. తోటి టీచర్ల పట్ల దారుణంగా వ్యవహరించాడు. పాఠశాలలో పనిచేస్తున్న దాదాపు 45మంది మహిళా టీచర్లపై అత్యాచారం చేసి చివరికి అరెస్ట్ అయ్యాడు. ఈ ఘటన పాకిస్థాన్ కరాచీలోని గుల్షన్-ఏ-హదీద్‌లో గల ఒక ప్రైవేట్ పాఠశాలలో జరిగింది. ప్రిన్సిపాల్ ఇర్ఫాన్ గఫూర్ మెమన్ మొత్తం 45మందికి పైగా మహిళా టీచర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పోలీసులు అభియోగాలు మోపారు. టీచర్లపై అత్యాచారం చేసిన తర్వాత ఆ వీడియో రికార్డు ఆయిన సీసీటీవీ ఫుటేజీని ఉపయోగించి వారిని బ్లాక్ మెయిల్ చేసేవాడని పోలీసులు తెలిపారు. సీసీటీవీ వీడియో రికార్డర్‌తో పాటు, ఇర్ఫాన్ ఫోన్ నుంచి దాదాపు 25 వీడియో క్లిప్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సీసీటీవీ వీడియోలు చూపించి ప్రిన్సిపాల్ బ్లాక్ మెయిల్