
Nurse killed 17 Patients-America: ఇన్సూలిన్ ఇచ్చి 17 మంది రోగులను చంపేసిన నర్సు...700 ఏళ్ల జైలు శిక్ష విధించి కోర్టు
ఈ వార్తాకథనం ఏంటి
నర్స్ అనే పవిత్ర వృత్తికి కళంకం తెచ్చిందో అమెరికా వాసురాలు.
వృత్తిని అడ్డుపెట్టుకుని 17 మందిని చంపేసింది.
షుగర్ వ్యాధి ఉన్న వారికి లేని వారికి కూడా ఇన్సూలిన్ మోతాదును అధికంగా ఇచ్చి వీరిని హత్య చేసినట్లు అంగీకరించడంతో అమెరికాలోని కోర్టు ఆమెకు 700 ఏళ్లకు పైగా జైలు శిక్షను విధించింది.
2020 - 2023 మధ్య ఐదు ఆసుపత్రులలో 17 మంది రోగుల మరణాలకు ఆమె కారణమని కోర్టు నిర్ధారించింది.
పెన్సిల్వేనియాకు చెందిన 41 ఏళ్ల నర్సు హీథర్ ప్రెస్డీ ఈ ఘాతుకానికి పాల్పడింది.
హీథర్ ప్రెస్డీ రాత్రిపూట విధుల్లో ఉన్నప్పుడు 22 మంది రోగులకు షుగర్ లేనివారికి ఇన్సూలిన్, షుగర్ ఉన్న వారికి అధిక మోతాదును ఇంజెక్ట్ చేసింది.
Nurse killed 17 Patients
ఇన్సూలిన్ అధిక మోతాదుతో గుండెపోటు...
దీంతో రోగులకు గుండెపోటు వస్తుంది.
ఇన్సూలిన్ అధిక మోతాదు తీసుకున్న వెంటనే కొందరు, కొద్ది సమయం తర్వాత మరికొందరు మరణించారు.
ఈ నేరాన్ని హీథర్ ప్రెస్డీ అంగీకరించడంతో కోర్టు ఆమెకు 700 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది.
హీథర్ ప్రెస్డీ తన మానసిక అనారోగ్యంతో బాధపడుతూ ఇంతటి ఘాతుకానికి పాల్పడినట్లు బాధిత కుటుంబాలు ఆరోపించాయి.
గతంలో హీథర్ ప్రెస్డీతో పనిచేసిన సహోద్యోగులు ఆమె ప్రవర్తన పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు.
ప్రెస్డీ రోగులపట్ల దురుసుగా ప్రవర్తించేదని వారిని తీవ్రంగా అవమానించేదని వారు తెలిపారు.
రోగుల పట్ల దురుసుగా ప్రవర్తించడంతో పాటుగా వారికి తీవ్ర హాని చేయాలనుకుంటున్నట్లు తనను కలిసిన వారికి తరచూ చెప్పేదని సహోద్యోగులు వెల్లడించారు.