LOADING...
Trump-Mamdani: ట్రంప్ అపాయింట్‌మెంట్ కోరిన న్యూయార్క్ మేయర్ మమ్దానీ.. 
ట్రంప్ అపాయింట్‌మెంట్ కోరిన న్యూయార్క్ మేయర్ మమ్దానీ..

Trump-Mamdani: ట్రంప్ అపాయింట్‌మెంట్ కోరిన న్యూయార్క్ మేయర్ మమ్దానీ.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 18, 2025
08:59 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, న్యూయార్క్ మేయర్‌గా ఎన్నికైన జోహ్రాన్ మమ్దానీ మధ్య గత కొంతకాలం వరకూ పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతగా ఉండేది. మేయర్ ఎన్నికల ముందు ట్రంప్ పలు సార్లు మమ్దానీపై ఘాటు వ్యాఖ్యలు చేసినప్పుడల్లా, మమ్దానీ కూడా కౌంటర్ ఇచ్చారు. కాని ఇప్పుడు ఆ వాతావరణం మెల్లగా మారుతున్నట్లుంది. ఇటీవల మమ్దానీ స్వయంగా ట్రంప్‌తో భేటీ కావాలని కోరటం పెద్ద చర్చనీయాంశమైంది. ఈ అభ్యర్థనను ట్రంప్ కూడా ధృవీకరిస్తూ.. మమ్దానీ వైట్‌హౌస్‌లో సమావేశానికి ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. ''న్యూయార్క్ మేయర్ మాతో మాట్లాడాలని కోరుకుంటున్నారు. మేము అవసరమైన చర్యలు తీసుకుంటాం'' అని ట్రంప్ వెల్లడించారు. మొత్తానికి నెలల తరబడి వైరం తర్వాత ట్రంప్-మమ్దానీ మధ్య స్వరంగా మారినట్లుగా కనిపిస్తోంది.

వివరాలు 

ఉచిత సేవల హామీలను అమలుకు కేంద్రంతో సహకారం అవసరం  

న్యూయార్క్ సమస్యల పరిష్కారానికి ఎవరినైనా కలిసి మాట్లాడడానికి తాను సిద్ధమేనని మమ్దానీ చెబుతున్నారు. తన టీమ్ ఇప్పటికే వైట్‌హౌస్‌తో సంప్రదింపులు ప్రారంభించిందని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన షట్‌డౌన్ కారణంగా నగర ఆర్థిక పరిస్థితి దెబ్బతినడంతో,ఆ సంక్షోభాన్ని సవరించడానికి వాషింగ్టన్ వెళ్లాలని ఆయన నిర్ణయించారు. అంతేకాక, ఎన్నికల సమయంలో మమ్దానీ ప్రకటించిన ఉచిత సేవల హామీలను అమలు చేయాలంటే కేంద్రంతో సహకారం అవసరమని భావిస్తున్నారు.

వివరాలు 

 సమావేశానికి సంబంధించి ఖచ్చితమైన తేదీ ఇంకా ఖరారు కాలేదు: కరోలిన్ లీవిట్

ఈ నేపథ్యంలో ట్రంప్‌ను కలిసేందుకు మమ్దానీ మక్కువ చూపిస్తుండగా.. ట్రంప్ కూడా సానుకూలంగా ఉన్నారనే సంకేతాలు బయటకు వస్తున్నాయి. ఆదివారం ట్రంప్ మాట్లాడినప్పుడు న్యూయార్క్ అభివృద్ధే తమ ఆకాంక్ష అని, ప్రతిదీ సజావుగా సాగాలనుకుంటున్నామని చెప్పారు. సోమవారం కూడా ఇదే తత్వం కొనసాగించారు. అయితే, ట్రంప్-మమ్దానీ సమావేశానికి సంబంధించి ఖచ్చితమైన తేదీ ఇంకా ఖరారు కాలేదని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ వెల్లడించారు.