Putin: పోర్న్ కంటే ఆసక్తికరంగా ఉండాలి.. ప్రత్యామ్నాయం అవసరం.. రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యాఖ్యలు
యువతకు వ్యసనంగా మారిపోతున్న పోర్నోగ్రఫీ సమస్యపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన ప్రత్యేకమైన సూచనలు ఇచ్చారు. పోర్నోగ్రఫీకి ప్రత్యామ్నాయంగా మరింత ఆసక్తికరమైన, ఉత్సాహభరితమైన కంటెంట్‌ను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. గురువారం 'రష్యా టుడే' ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంలో తన అభిప్రాయాలను పంచుకున్నారు.
అడల్ట్ కంటెంట్ ప్రపంచ సమస్య
ప్రపంచవ్యాప్తంగా అడల్ట్ కంటెంట్‌కు పెరుగుతున్న ఆదరణను గుర్తించిన పుతిన్, ఇది ఒక అంతర్జాతీయ సమస్యగా మారిందని అంగీకరించారు. పోర్నోగ్రఫీని నిషేధించడం ఈ సమస్యకు పరిష్కారంగా ఒక మార్గం కావచ్చు. అయితే, పోర్నోగ్రఫీ కంటే మరింత ఆకర్షణీయమైన, వాసన సృష్టించే ప్రత్యామ్నాయ కంటెంట్‌ను ప్రజలకు అందించడం కీలకమని ఆయన అభిప్రాయపడారు. రష్యాలో జననాల రేటు తగ్గిపోతున్న నేపధ్యంలో, ఈ సమస్యను ఎదుర్కొనే దిశగా పుతిన్ ఇటీవల తీసుకున్న నిర్ణయాలు కూడా సంచలనం రేపాయి. ఉద్యోగులు లంచ్ లేదా కాఫీ బ్రేక్‌ల సమయంలో శృంగారంలో పాల్గొని పిల్లలు కలుగచేయాలని ఆయన పిలుపునిచ్చారు.