LOADING...
Trudeau: ట్రేడ్ వార్ వేళా కీలక పరిణామం.. రిపోర్టర్ల ఎదుటే ఏడ్చేసిన ట్రూడో..!
ట్రేడ్ వార్ వేళా కీలక పరిణామం.. రిపోర్టర్ల ఎదుటే ఏడ్చేసిన ట్రూడో..!

Trudeau: ట్రేడ్ వార్ వేళా కీలక పరిణామం.. రిపోర్టర్ల ఎదుటే ఏడ్చేసిన ట్రూడో..!

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 07, 2025
12:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్‌ల ప్రభావం కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోపై తీవ్రంగా పడింది. పదవి నుంచి త్వరలోనే తప్పుకోనున్న ఆయన, విలేకరుల సమావేశంలో భావోద్వేగానికి లోనయ్యారు. ''నేను ఎప్పుడూ కెనడా ప్రయోజనాలను ప్రధానంగా పరిగణించాను.ప్రజల మద్దతు నాకుంది.నా చివరి రోజుల్లో కూడా వారిని వదిలేయలేదు.భవిష్యత్తులోనూ ప్రజల కోసం నిలబడతాను'' అంటూ భావోద్వేగంతో కన్నీటి పర్యంతమయ్యారు. ఇక కెనడా, మెక్సికోకు అదనపు టారిఫ్‌ల నుంచి నెల రోజులపాటు ట్రంప్ ఇచ్చిన ఉపశమనం గురించి ఆయన నిరాశతో స్పందించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియా సంక్షోభాలు, అలాగే ట్రంప్ ప్రభుత్వాన్ని కష్టకాలంగా అభివర్ణించారు.

వివరాలు 

"అమెరికా ఫస్ట్" విధానం

కెనడా ప్రజలకు సేవ చేయడం గౌరవంగా భావిస్తున్నట్లు వెల్లడించారు. ట్రంప్ విధించిన టారిఫ్‌లకు ప్రతిగా కెనడా కూడా ఆంక్షలు, ఇతర వ్యూహాలను అమలు చేస్తుందని తెలిపారు. కెనడా, మెక్సికో దేశాలు ఆర్థికంగా స్థిరంగా ఉండాలి గనుకే "అమెరికా ఫస్ట్" విధానం సఫలీకృతమవుతుందని ట్రూడో అభిప్రాయపడ్డారు. ఒకరి విజయం, మరొకరి పరాజయం మంచిది కాదని, ఇద్దరూ విజయవంతమయ్యే విధంగా ఉండడం అంతర్జాతీయ సంబంధాలకు మేలని పేర్కొన్నారు. ఇటీవల వచ్చిన సర్వేలు ట్రూడో ప్రజాదరణ తగ్గినట్లు చూపడంతో, ఆయన జనవరి 6న లిబరల్ పార్టీ నేత పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇక మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మెక్సికో అధ్యక్షురాలు క్లౌడియా షీన్‌బామ్, కెనడా ప్రధాని ట్రూడోతో సుదీర్ఘ చర్చలు జరిపారు.

వివరాలు 

మెక్సికో-కెనడా అదనపు టారిఫ్‌లు నెల రోజుల పాటు నిలిపివేత 

అనంతరం, అమెరికా-మెక్సికో-కెనడా ఒప్పందంలోని దేశాలకు విధించిన అదనపు టారిఫ్‌లను నెల రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' ప్లాట్‌ఫామ్‌లో ప్రకటించారు. ప్రాంతీయ ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసేందుకు, మెక్సికో ఎగుమతిదారులు తమ వ్యాపార వ్యవస్థలో మార్పులు చేసుకోవడానికి ఇది సహాయపడుతుందని తెలిపారు. మెక్సికో అధ్యక్షురాలు క్లౌడియా ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. అమెరికా వాణిజ్య శాఖ మంత్రి హోవార్డ్ లుట్నిక్, ప్రస్తుతం అమల్లోకి వచ్చిన ఈ ఉపశమనం భవిష్యత్తులో యూఎస్‌ఎంసీఏ ఒప్పంద పరిధిలోకి వచ్చే వస్తువులన్నిటికీ విస్తరించేందుకు అవకాశముందని సంకేతాలిచ్చారు. ఈ ఒప్పందం కింద వ్యాపారం చేస్తున్నవారికి సుంకాల నుంచి మినహాయింపు లభిస్తుందని, కానీ ఒప్పందం బయట ఉన్నవారు టారిఫ్‌లను ఎదుర్కొక తప్పదని స్పష్టం చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రిపోర్టర్ల ఎదుటే ఏడుస్తున్న ట్రూడో