Page Loader
అమెరికా: మేరీల్యాండ్‌లో కాల్పుల మోత; ముగ్గురు మృతి
అమెరికా: మేరీల్యాండ్‌లో కాల్పుల మోత; ముగ్గురు మృతి

అమెరికా: మేరీల్యాండ్‌లో కాల్పుల మోత; ముగ్గురు మృతి

వ్రాసిన వారు Stalin
Jun 12, 2023
09:38 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలోని మేరీల్యాండ్‌ అన్నాపోలిస్‌లోని ఒక ప్రైవేట్ నివాసంలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఈ ఘటనలో మరో ముగ్గురు గాయపడ్డారు. వ్యక్తిగత కక్షతోనే నిందితుడు కాల్పులకు పాల్పడినట్లు పోలీసులు వివరించారు. ఈ నేపథ్యంలో తుపాకీ కాల్పులు జరిపినట్లు అనుమానిస్తున్నట్లు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అన్నాపోలిస్‌లోని పొరుగున ఉన్న ప్యాడింగ్‌టన్ ప్లేస్‌లోని 1000 బ్లాక్‌లోని ఒక ఇంటిలో కాల్పులు జరిగినట్లు ఆదివారం రాత్రి (స్థానిక కాలామానం ప్రకారం) పోలీసులకు సమాచారం అందింది. పోలీసు చీఫ్ ఎడ్ జాక్సన్ మాట్లాడుతూ, ఆరుగురిపై కాల్పులు జరిగాయని, వారిలో ముగ్గురు మరణించారని చెప్పారు. వీరి వయసు 20 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉంటుందని పోలీసులు చెప్పారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మేరిల్యాండ్‌లో కాల్పులు