Ukraine: ఉక్రెయిన్‌పై మరోసారి విరుచుకుపడిన రష్యా.. ఆరుగురు మృతి
ఈ వార్తాకథనం ఏంటి
ఉక్రెయిన్‌పై రష్యా దాడులు ఆగడం లేదు. తాజాగా మరోసారి భారీ స్థాయిలో రష్యా దాడులకు తెగబడింది. రాజధాని కీవ్‌తో పాటు ఒడెసా సహా దాదాపు 20 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు, క్షిపణులతో దాడులు నిర్వహించింది. మొత్తం 800కు పైగా డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించినట్లు సమాచారం. ఈ దాడుల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. రష్యా దాడుల వల్ల నివాస భవనాలు, కీలక మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పలు ప్రాంతాల్లో ఆస్తి నష్టం సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. తాజా పరిణామాల నేపథ్యంలో తమ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసుకునేందుకు అంతర్జాతీయ సహకారం అవసరమని ఉక్రెయిన్ ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కీవ్, ఒడెసాపై భారీ దాడులు.. వణికిన ఉక్రెయిన్
Russia launches one of longest drone and missile barrages of war on Ukraine, killing at least six people as strikes near NATO borders prompt Poland to scramble fighter jets and Slovakia to close its border pic.twitter.com/A9v2E3b1JF
— TRT World Now (@TRTWorldNow) May 13, 2026