LOADING...
Asif Ali Zardari: 'ఆపరేషన్ సిందూర్'తో పాక్‌లో భయాందోళనలు.. బంకర్‌లో దాక్కోవాలని చెప్పారు : అధ్యక్షుడు జర్దారీ
'ఆపరేషన్ సిందూర్'తో పాక్‌లో భయాందోళనలు.. బంకర్‌లో దాక్కోవాలని చెప్పారు : అధ్యక్షుడు జర్దారీ

Asif Ali Zardari: 'ఆపరేషన్ సిందూర్'తో పాక్‌లో భయాందోళనలు.. బంకర్‌లో దాక్కోవాలని చెప్పారు : అధ్యక్షుడు జర్దారీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 28, 2025
04:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్ లో నెలకొన్న భయాందోళనలు, భారత దాడుల ప్రభావం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ చేసిన వ్యాఖ్యలు ఈ అంశాన్ని మరింత స్పష్టంగా బయటపెట్టాయి. శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన జర్దారీ, భారత దాడుల సమయంలో పాకిస్తాన్ అగ్ర నాయకత్వంలో తీవ్ర భయానక వాతావరణం నెలకొందని స్వయంగా అంగీకరించారు. భారత్ దాడులు ప్రారంభమైన వేళ తన సైనిక కార్యదర్శి భద్రత కోసం బంకర్‌లోకి వెళ్లాలని సలహా ఇచ్చారని జర్దారీ వెల్లడించారు. అయితే తాను ఆ సూచనను తిరస్కరించానని తెలిపారు. నా సైనిక కార్యదర్శి నా దగ్గరకు వచ్చి యుద్ధం ప్రారంభమైందని చెప్పారు. మనం బంకర్‌లోకి వెళ్లాలని సూచించారు.

Details

ర్యాలీలో కీలక వ్యాఖ్యలు

కానీ నేను నిరాకరించాను. నాకు వీరమరణం సంభవించాల్సి వస్తే, ఇక్కడే చనిపోతానని జర్దారీ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఆయన 2007లో హత్యకు గురైన తన భార్య, మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో వర్ధంతి సందర్భంగా శనివారం జరిగిన ఒక ర్యాలీలో చేశారు. ఆ సందర్భంగా జర్దారీ మాట్లాడుతూ, తన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీకి చెందిన ప్రతి కార్యకర్త దేశం కోసం ప్రాణత్యాగానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఇక, పాకిస్తాన్‌ను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ చేసిన శాంతంగా మీ ఆహారం తినండి, లేకపోతే నా బుల్లెట్లు మీ కోసం వేచి ఉంటాయనే హెచ్చరికకు జర్దారీ స్పందించారు.

Details

ప్రతీకార చర్యగా 'ఆపరేషన్ సిందూర్'ను ప్రారంభించింది

బుల్లెట్లు పేల్చేది పాకిస్తానే అని వ్యాఖ్యానించిన ఆయన, భారత ఆర్థిక వ్యవస్థ పాకిస్తాన్ కంటే పది రెట్లు పెద్దదై ఉండొచ్చు, కానీ యుద్ధం చేయడానికి భారత్‌కు ధైర్యం లేదంటూ ప్రగల్భాలు పలికారు. అయితే జర్దారీ వ్యాఖ్యలే భారత్ ఎంత తీవ్రంగా దాడులు చేసిందో స్పష్టంగా తెలియజేస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దాడుల సమయంలో జర్దారీతో పాటు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, ప్రధాని షరీఫ్ కూడా భద్రతా కారణాలతో సేఫ్ హౌజుల్లోకి వెళ్లినట్లు సమాచారం. 26 మంది పౌరులు బలైన పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ప్రతీకార చర్యగా 'ఆపరేషన్ సిందూర్'ను ప్రారంభించింది.

Advertisement

Details

భారత్ భీకర దాడులు చేసింది

ఈ ఆపరేషన్‌లో భాగంగా పాకిస్తాన్ వ్యాప్తంగా ఉన్న ఉగ్రవాద శిబిరాలు, కార్యాలయాలపై భారత్ భీకర దాడులు చేసింది. ఈ దాడుల్లో వందలాది మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అనంతరం పాకిస్తాన్ సైన్యం భారత్‌పై దాడి చేసేందుకు ప్రయత్నించగా, భారత క్షిపణులు పాకిస్తాన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన కీలక ఎయిర్‌బేసులను నాశనం చేశాయి. పరిస్థితి పూర్తిగా భారత్ ఆధీనంలోకి వెళ్లడంతో, చివరకు మే 10న పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ కాల్పుల విరమణ కోరడంతో ఈ ఘర్షణకు ముగింపు పలికింది.

Advertisement