Osama Bin Laden : ఓవైపు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం.. మరోవైపు నెట్టింట ఒసామా బిన్ లాడెన్ లేఖ
ఇజ్రాయెల్ హమాస్ మధ్య గత 45 రోజులుగా భీకర యుద్ధం జరుగుతోంది.తమపై హమాస్ మిలిటెంట్ల దాడులకు ప్రతిగా ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకుంది.ఈ మేరకు మొత్తం హమాస్ నెట్‌వర్క్‌నే నామరూపాల్లేకుండా చేశాయి. పాలస్తీనీయులపై ఇజ్రాయెల్ భీకర దాడులు ముగింపు దశకు వస్తున్న వేళ, గతంలో అమెరికన్లకు ఒసామా బిన్ లాడెన్ రాసిన ఓ లేఖ తాజాగా వైరల్‌గా మారింది. ఒసామా బిన్ లాడెన్ ఎవరంటే : ఒసామా బిన్ లాడెన్, ఈ పేరు ప్రపంచ దేశాల్లో అందరికీ సుపరిచితమే, అమెరికాలో 2001 సెప్టెంబర్ 11 దాడులకు పాల్పడిన అల్ ఖైదా అధినేత బిన్ లాడెన్‌ను అమెరికా వెంటాడి చంపేసింది. పాకిస్థాన్ లో తలదాచుకుంటున్నాడని గుర్తించిన అగ్రరాజ్యం, వాయు మార్గంలో వచ్చి మట్టుబెట్టింది.
వేలాది మంది నెటిజన్లు లేఖను షేర్ చేస్తున్నారు
9/11 దాడుల తర్వాత అమెరికా వాసులకు బిన్ లాడెన్ రాసిన లేఖను తాజాగా నెటిజన్లు షేర్ చేస్తున్నారు. బిన్ లాడెన్ లేఖలో రాసిన వ్యాఖ్యలతో కొందరు ఏకీభవించారు. ఈ మేరకు వేలాది మంది నెటిజన్లు సదరు లేఖను షేర్ చేయడంతో వైరల్ అయ్యింది. 9/11 దాడులను అల్ ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ సమర్థించుకునే ప్రయత్నం చేశాడు.పాలస్తీనాపై ఇజ్రాయెల్ దురాక్రమణను లేఖలో బిన్ లాడెన్ ప్రస్తావించడం గమనార్హం. ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతు ఇచ్చినందుకే 9/11 దాడులు చేసేందుకు ప్రధాన కారణమన్నాడు. ఐడీఎఫ్ అణిచివేతకు అమెరికా మద్దతుని లాడెన్ తప్పుబట్టాడు. 2001 దాడుల తర్వాత అణచివేతే తమపై దాడికి కారణమని ఆనాటి అధ్యక్షుడు జార్జ్ బుష్ గ్రహించారన్నారు.అప్పటిదాకా పాలస్తీనా గురించి ఎవరూ మాట్లాడలేదన్నాడు.