
London-Mumbai Flight: అత్యవసరంగా ల్యాండ్ అయ్యిన విమానం.. తుర్కియేలో చిక్కుకున్న 200 మంది భారతీయులు
ఈ వార్తాకథనం ఏంటి
లండన్ నుండి ముంబయికి బయలుదేరిన విమానం తుర్కియే (Turkey)లో అత్యవసరంగా ల్యాండ్ అయింది.
ఈ ఘటనతో, అక్కడి మారుమూల విమానాశ్రయంలో బుధవారం రాత్రి నుంచి 200 మంది భారతీయ ప్రయాణికులు చిక్కుకుపోయారు.
జాతీయ మీడియా కథనాల ప్రకారం, లండన్ నుంచి వర్జిన్ అట్లాంటిక్ విమానం ముంబయి ప్రయాణానికి బయలుదేరింది.
అయితే, మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా, తుర్కియేలోని దియార్‌బకిర్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యింది.
కానీ, ల్యాండింగ్ సమయంలో సాంకేతిక సమస్య ఏర్పడిందని ప్రయాణికులు వెల్లడించారు.
వివరాలు
ప్రయాణికులకు విమానాశ్రయం నుండి బయటకు వెళ్లే అనుమతులు లేవు
దీంతో దాదాపు 20 గంటలుగా ప్రయాణికులు అక్కడే ఉండిపోయారు. వారిలో 200 మందికిపైగా భారతీయులున్నారని సమాచారం.
అయితే, వారు ఎప్పుడు గమ్యస్థానానికి చేరుకుంటారన్న విషయంలో ఇంకా స్పష్టత లేదు.
ప్రత్యామ్నాయ ఏర్పాట్ల గురించి ఇప్పటివరకు విమానయాన సంస్థ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.
ప్రస్తుతం ఎదురైన సమస్యను పరిష్కరించేందుకు తగిన సౌకర్యాలు ఆ విమానాశ్రయంలో లేవని ఓ ప్రయాణికుడు తెలిపారు.
అలాగే, సాధ్యమైనంత త్వరగా రవాణా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను కోరారు.
అదనంగా, ఆ ప్రాంతం మిలిటరీ బేస్ కావడంతో, విమానాశ్రయం నుండి బయటకు వెళ్లే అనుమతులు లేకుండా ఇబ్బంది పడుతున్నట్లు ప్రయాణికులు వెల్లడించారు.