
China: ఉత్తర చైనాలో కార్చిచ్చు బీభత్సం.. మంటల అదుపుకు రంగంలోకి 3వేల మంది!
ఈ వార్తాకథనం ఏంటి
చైనాలో కార్చిచ్చు మహా బీభత్సాన్ని సృష్టిస్తోంది. ఉత్తర చైనాలోని షాన్షీ ప్రావిన్స్‌లో ఉన్న లింగ్‌చౌన్ కౌంటీలో మంగళవారం ఉదయం అటవీ ప్రాంతంలో కార్చిచ్చు చెలరేగింది.
ఈ అగ్నికీలలను నియంత్రించేందుకు అక్కడి అధికారులు అప్రమత్తమై, 3,000 మందికి పైగా సహాయక సిబ్బందిని మోహరించారు.
ఈ కార్చిచ్చు అసలు శనివారం పొరుగున ఉన్న హుగువాన్ కౌంటీలో మొదలైందని, ఆదివారం రోజున బలమైన ఈదురు గాలుల ప్రభావంతో అది లింగ్‌చౌన్ జిల్లా లియుక్వాన్ టౌన్‌షిప్ వరకు వ్యాపించిందని స్థానిక అధికారులు వెల్లడించినట్లు ఆ ప్రాంతీయ మీడియా నివేదించింది.
మంటలు భారీగా వ్యాపిస్తున్న నేపథ్యంలో వాటిని నియంత్రించేందుకు ఐదు హెలికాప్టర్లను హవాయ్ మద్దతుగా రంగంలోకి దించారు.
వివరాలు
266 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలింపు
ఇక దాంతో పాటు, ఇప్పటివరకు లింగ్‌చౌన్ ప్రాంతం నుండి 266 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు.
ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్పష్టం చేశారు. అయితే మంటలపై అదుపు కోసం చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నప్పటికీ, బలమైన గాలుల ప్రవాహం, ప్రమాదకరమైన భౌగోళిక పరిస్థితులు, అలాగే అక్కడి దట్టమైన, సులభంగా మండే వృక్ష సంపద వంటివి అగ్నిమాపక సిబ్బందికి పెద్ద సవాలుగా మారాయని అధికారులు పేర్కొన్నారు.