Loading...
US- Russia War : ఉక్రెయిన్‌తో యుద్ధంలో 7 లక్షల మంది రష్యన్ సైనికులు మృతి!
ఉక్రెయిన్‌తో యుద్ధంలో 7 లక్షల మంది రష్యన్ సైనికులు మృతి!

US- Russia War : ఉక్రెయిన్‌తో యుద్ధంలో 7 లక్షల మంది రష్యన్ సైనికులు మృతి!

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 24, 2026
10:52 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉక్రెయిన్‌తో కొనసాగుతున్న యుద్ధంలో రష్యా భారీ ప్రాణనష్టాన్ని చవిచూస్తోంది. ఇప్పటివరకు ఈ యుద్ధంలో సుమారు 7 లక్షల మంది రష్యన్ సైనికులు మరణించినట్లు స్వతంత్ర మీడియా సంస్థలు 'మెడూజా' (Meduza), 'మీడియాజోనా' (Mediazona) సంచలన నివేదికను వెల్లడించాయి. రష్యా అధికారిక గణాంకాల సంస్థ 'రోస్టాట్' (Rosstat) నుంచి లీకైన సమాచారాన్ని విశ్లేషించిన అనంతరం ఈ అంచనాకు వచ్చినట్లు తెలిపాయి. యుద్ధంలో రష్యా ఎదుర్కొంటున్న వాస్తవ ప్రాణనష్టంపై ఈ గణాంకాలు కీలక సమాచారాన్ని బయటపెట్టాయి.

వివరాలు 

గత సెప్టెంబర్ నాటికి 4.9 లక్షల మంది రష్యన్ సైనికుల మృతి

రోస్టాట్ అధికారిక గణాంకాల ప్రకారం.. గత సెప్టెంబర్ నాటికి 4.9 లక్షల మంది రష్యన్ సైనికులు మరణించినట్లు నమోదైంది.

అయితే 2025, 2026 సంవత్సరాల్లో యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వేలాది మంది సైనికుల మరణాలను అధికారిక రికార్డుల్లో నమోదు చేయలేదని మెడూజా, మీడియాజోనా సంస్థలు పేర్కొన్నాయి.

రికార్డుల్లో లేని ఈ మరణాలతో పాటు యుద్ధరంగంలో ఆచూకీ తెలియకుండా గల్లంతైన సైనికుల సంఖ్యను కూడా పరిగణనలోకి తీసుకుంటే.. మొత్తం మరణాల సంఖ్య 7 లక్షలకు పైగా ఉంటుందని అంచనా వేశాయి.

రష్యా సైన్యం ఎదుర్కొంటున్న భారీ ప్రాణనష్టానికి ఈ నివేదికలు అద్దం పడుతున్నాయి.

ADVERTISEMENT