
Mozambique coast: మొజాంబిక్ తీరంలో భారీ ప్రమాదం.. ఫిషింగ్ బోటు మునిగి 91 మంది మృతి
ఈ వార్తాకథనం ఏంటి
ఆఫ్రికా దేశం మొజాంబిక్‌లోని ఉత్తర తీరంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు పడవ మునగడంతో 90 మందికి పైగా జలసమాధి అయ్యారు.
సుమారు 130 మందితో కూడిన ఫిషింగ్ బోట్ నంపులా ప్రావిన్స్ సమీపంలోని ద్వీపానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.
నంపుల రాష్ట్ర కార్యదర్శి జైమ్ నెటో మాట్లాడుతూ పడవ సామర్థ్యానికి మించి ప్రయాణించడంతోనే ఈ దుర్ఘటన జరిగిందని తెలిపారు.
ఈ ప్రమాదంలో 91 మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో చాలా మంది చిన్నారులు కూడా ఉన్నారని స్థానిక అధికారులు పేర్కొన్నారు.
రక్షకులు ఐదుగురు ప్రాణాలు కనుగొన్నారు మరియు ఇతరుల కోసం వెతుకుతున్నారు, అయితే సముద్ర పరిస్థితులు అల్ల్లకల్లోలంగా ఉండడంతో ఆపరేషన్ కష్టతరం అవుతోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
పడవ మునిగి 90మందికి పైగా జలసమాధి
#Mozambique #France Boat Reportedly Sinks Off Coast of Mozambique Killing Over 90 People https://t.co/30gJZZleNJ pic.twitter.com/CvgBHZp4LH
— Sputnik Africa (@sputnik_africa) April 8, 2024