LOADING...
H-1B Visa: లక్ష డాలర్ల 'హెచ్‌-1బీ వీసా'కి.. 2 లక్షల దరఖాస్తులు
లక్ష డాలర్ల 'హెచ్‌-1బీ వీసా'కి.. 2 లక్షల దరఖాస్తులు

H-1B Visa: లక్ష డాలర్ల 'హెచ్‌-1బీ వీసా'కి.. 2 లక్షల దరఖాస్తులు

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 03, 2026
11:38 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా హెచ్‌-1బీ వీసా ఫీజును భారీగా పెంచినా..ఈ వీసాపై ఆసక్తి మాత్రం ఏమాత్రం తగ్గలేదని తాజా గణాంకాలు చెబుతున్నాయి. 2026 ఆర్థిక సంవత్సరానికి హెచ్‌-1బీ వీసాల కోసం భారీసంఖ్యలో దరఖాస్తులు వచ్చాయని అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి మార్క్‌వేన్ ముల్లిన్ వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం..ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు హెచ్‌-1బీ వీసా కోసం 2.86లక్షల దరఖాస్తులు నమోదయ్యాయి. వీరిలో రెండు లక్షల మందికి పైగా ఒక్కొక్కరు లక్షడాలర్ల ఫీజు చెల్లించి తమ దరఖాస్తులను సమర్పించారు. అధిక ఫీజు చెల్లించిన అభ్యర్థుల దరఖాస్తులను సుమారు 15రోజుల్లోనే ప్రాసెస్ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. అదే సాధారణ విధానంలో దరఖాస్తు చేసుకున్నవారి అప్లికేషన్ల పరిశీలనకు దాదాపు 7.5నెలల సమయం పడుతుందని వివరించారు.

వివరాలు 

వన్‌టైమ్ ఫీజు

ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన హెచ్‌-1బీ వీసా ఫీజు పెంపు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నిర్ణయం ప్రకారం హెచ్‌-1బీ వీసా కోసం దరఖాస్తు చేసే వారికి వార్షికంగా లక్ష డాలర్ల రుసుము వర్తిస్తుంది. అమెరికాలోని సంస్థలు విదేశీ నిపుణులను నియమించుకోవాలంటే ప్రతి వీసాకు ఈ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో ఒకేసారి చెల్లించాల్సిన వన్‌టైమ్ ఫీజుగా దీనిని నిర్ణయించారు. అయితే అమెరికాలో ఇప్పటికే చదువుకుంటున్న విదేశీ విద్యార్థులకు ఈ ఫీజు నుంచి మినహాయింపు కల్పించారు. అలాగే అమెరికా వెలుపల నుంచి హెచ్‌-1బీ వీసాకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకే ఈ కొత్త ఫీజు వర్తిస్తుందని అమెరికా ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది.

Advertisement