
Trump: పహల్గాం దాడి అమానుషం.. కశ్మీర్ విషయంలో భారత్-పాక్‌లకే బాధ్యత : ట్రంప్
ఈ వార్తాకథనం ఏంటి
జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్రంగా ఖండించారు.
ఈ సందర్భంగా ఆయన భారత్-పాక్‌ల మధ్య కొనసాగుతున్న కశ్మీర్ సమస్యపై కీలక వ్యాఖ్యలు చేశారు.
కశ్మీర్ విషయంలో ఈ రెండు దేశాల మధ్య చాలా ఏళ్లుగా ఘర్షణలు జరుగుతున్నాయని పేర్కొన్న ట్రంప్, ఈ సమస్యను భారత్-పాక్‌లు స్వయంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.
రోమ్ పర్యటనకు బయలుదేరిన సమయంలో ట్రంప్ ఎయిర్‌ఫోర్స్ వన్‌లో విలేకరులతో మాట్లాడారు.
భారత్-పాక్‌ల మధ్య ఉద్రిక్తతలపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ, 'ఈ రెండు దేశాలు నాకు చాలా ముఖ్యమైనవే. కశ్మీర్ అంశం చాలా కాలంగా కొనసాగుతున్న ఘర్షణల కారణం.
Details
భారత్-పాక్‌ల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు
ఇటీవల పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి అత్యంత చెత్త పని. ముష్కరులు అమాయకులపై కాల్పులు జరిపారు. ఇది చాలా విచారకరమైన విషయం.
అయినా సరిహద్దు సమస్యలను ఈ దేశాలే పరిష్కరించుకోవాలని స్పష్టం చేశారు.
గత ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం సమీపంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన బైసరన్ లోయలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.
సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు పర్యాటకులను చుట్టుముట్టి అతి సమీపం నుంచి కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.
లష్కరే తోయిబా అనుబంధ సంస్థగా పేర్కొనబడిన 'ది రెసిస్టెంట్ ఫోర్స్' ఈ దాడికి పాల్పడినట్టు సమాచారం. ఈ ఘోర ఘటనతో భారత్-పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రతరం అయ్యాయి.