Pak-America: మోదీకి.. పాక్ -అమెరికన్ బిజినెస్ మెన్ అరుదైన ప్రశంస
ప్రధాని నరేంద్ర మోదీకి అరుదైన ప్రశంస లభించింది. బాల్టీ మోర్ నివాసి పాక్ -అమెరికన్ బిజినెస్ మెన్ అజామ్ తరార్ .. మోడీ కేవలం భారత్ కే కాకుండా దక్షిణాసియాకు మంచి చేకూరుస్తారని ఆయన ఆకాంక్షించారు. ఆయన మూడో సారి ప్రధాని పీఠం దక్కడం ఖాయన్నారు. భవిష్యత్తులో తమ దేశానికి కూడా ఇలాంటి నాయకుడు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. మోడీని ప్రశంసాపూర్వకమైన నాయకుడిగా చెపుతునే,పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు కలిగిన నేతన్నారు. ప్రతి కూల పరిస్ధితుల నడుమ సైతం రాజకీయంగా ఇబ్బందులు ఉన్నా ఆయన తమ దేశంలో పర్యటించారన్నారు. పాక్ తో మోడీ చర్చలు జరిపి , వాణిజ్య సంబంధాలను ఆశిస్తున్నట్లు అజామ్ తరార్ పి.టి.ఐ కిచ్చిన ఇంటర్వూలో ఆశాభావం వ్యక్తం చేశారు.
పాకిస్ధాన్ పాలకులతో సన్నిహిత సంబంధాలు
ఇస్లామాబాద్ తో మంచి శాంతియుత సంబంధాలు ఉండటం భారత్ కు మంచిదని చెప్పారు. నరేంద్ర మోడీ మాత్రమే కాబోయే ప్రధాని అని కుండబద్దలు కొట్టారు. ఈ పాక్ వ్యాపారవేత్త 90 వ దశకంలో అమెరికా వచ్చి స్ధిరపడ్డారు. ఆయనకు అప్పటి పాకిస్థాన్ పాలకులతో సన్నిహిత సంబంధాలు ఉండేవి. 97 కోట్ల మంది భారతీయులు తమ ఓటు హక్కు వినియోగించుకోవడం అతి పెద్ద ప్రజాస్వామ్యంలో విశేషంగా అభిప్రాయపడ్డారు. 2024 నుంచి నరేంద్ర మోడీకి విశేషంగా ఆదరణ పెరిగిందని అజామ్ తరార్ తెలిపారు.
విద్యుత్ ఛార్జీలు భారం
తమ దేశ ప్రజలు సైతం భారతీయుల నుంచి నేర్చుకోవాల్సి ఉందన్నారు. తమ దేశంలో నెలకొన్న ఆర్ధిక సంక్షోభం వల్ల సహా అక్కడి పాక్ ఆక్రమిత కాశ్మీర్(పివోకె) లో అశాంతి నెలకొందని అభిప్రాయపడ్డారు. ఆర్ధిక సంక్షోభంతో ద్రవ్యోల్బణం పెరిగింది. దాంతో పెట్రోల్ ధరలు అధికమయ్యాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐ.ఎం.ఎఫ్) పన్నులను పెంచమంటోంది. విద్యుత్ ఛార్జీలు భారమయ్యాయి. ఎగుమతులు చేయలేకపోతున్నాం. విద్యుత్ ఛార్జీలు భారం కావడం వల్లే పివోకెలో అల్లర్లు , ఘర్షణలు జరుగుతున్నాయన్నారు. పాక్ ప్రధాని.. పివోకెలో నివసించే ప్రజలకు ఆర్ధిక సాయం ప్రకటించడాన్నిఅజామ్ తార్ తప్పు పట్టారు.