NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / పేదరికం ఉచ్చులో పాకిస్థాన్.. 40 శాతం మందికి కనీస సౌకర్యాల్లేవ్
    తదుపరి వార్తా కథనం
    పేదరికం ఉచ్చులో పాకిస్థాన్.. 40 శాతం మందికి కనీస సౌకర్యాల్లేవ్
    40 శాతం మందికి కనీస సౌకర్యాల్లేవ్

    పేదరికం ఉచ్చులో పాకిస్థాన్.. 40 శాతం మందికి కనీస సౌకర్యాల్లేవ్

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Sep 25, 2023
    11:34 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దాయాది దేశం పాకిస్థాన్ కరువు కోరల్లో చిక్కుకుంది. ఈ మేరకు పాక్ పేదరికం బారిన పడిందని ప్రపంచ బ్యాంక్ నివేదిక తాజాగా విడుదలైంది.

    పాక్ దేశంలో 23.14 కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. అందులో 40 శాతం మంది జనం దారిద్ర రేఖకు దిగువున ఉన్నారని నివేదికలో పేర్కొంది. అంటే రమారమి 9.5 కోట్ల మంది పేదరికంలో మగ్గుతున్నారని తెలిపింది.

    ఈ క్రమంలోనే పాక్ ను రాజకీయ అస్థిరత, ఆర్థిక సంక్షోభం, ఉగ్రవాద సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. గతేడాది పాక్ పేదరికం 34.2 శాతంగా ఉంటే ఈసారి 39.4 శాతానికి పెరిగిందని వెల్లడించింది.

    1.25 కోట్ల ప్రజలు రోజూ వారి ఆదాయం 3.65 డాలర్ల కన్నా తక్కువే ఉన్నట్లు తాజా నివేదిక బహిర్గతం చేసింది.

    DETAILS

     అత్యవసర నిర్ణయాలు తీసుకోవాలి, వృథా ఖర్చులు తగ్గించాలి : ప్రపంచ బ్యాంకు

    పాకిస్తాన్ ఎకనామిక్ మోడల్ ఆ దేశంలో పేదరికాన్ని తగ్గించట్లేదని ప్రపంచ బ్యాంకు ఆర్థిక వేత్త టోబియాస్ హక్ అభిప్రాయపడ్డారు.

    ఆర్థికంగా వెనకబడిన దేశాలతో పోల్చితే పాక్ ప్రజల జీవన ప్రమాణాలు ఘోరంగా పడిపోయాయన్నారు.

    పెరుగుతున్న ధరల కట్టడి సహా, పాక్ వ్యవసాయం, రియల్ ఎస్టేట్ పై తక్షణమే పన్నులతో దిద్దిబాటు చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ మేరకు అత్యవసర నిర్ణయాలు తీసుకోవాలని, వృథా ఖర్చలు తగ్గించాలన్నారు.

    టాక్స్ టూ జీడీపీ శాతాన్ని 5 శాతానికి పెంచడం, జీడీపీలో ఖర్చులను 2.7 శాతం తగ్గించాలని హక్ ప్రతిపాదించారు.

    పాక్ జీడీపీలో 22 శాతానికి సమానమైన పన్నులను వసూలు చేసే సామర్థ్యాన్ని కలిగి ఉండగా, కేవలం 10.2 శాతం మాత్రమే ప్రస్తుతం వసూలు చేస్తోందని హక్ అన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పాకిస్థాన్

    తాజా

    KTR: బీఆర్ఎస్ నేత కేటీఆర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    CIRCADIAN APP: 7 సెకన్లలో గుండె సమస్యలను గుర్తించే యాప్‌.. 14 ఏళ్ల బాలుడి ఆవిష్కరణ గుండె
    #NewsBytesExplainer: డోనాల్డ్ ట్రంప్,ఎలాన్ మస్క్ స్నేహ బంధం ఎక్కడ చెడింది? డొనాల్డ్ ట్రంప్
    Starlink: ఎలాన్‌ మస్క్‌ స్టార్‌ లింక్‌కు సేవలకు గ్రీన్‌ సిగ్నల్‌  స్టార్‌లింక్‌

    పాకిస్థాన్

    పాకిస్థాన్ ఆపద్ధర్మ ప్రధానిగా అన్వర్ ఉల్ హక్ కాకర్ నియామకం  ప్రధాన మంత్రి
    Imran Khan : ఇమ్రాన్‌ఖాన్‌కు ఘోర అవమానం.. షేమ్ అన్ పీసీబీ అంటూ ఫ్యాన్స్ ఫైర్ క్రికెట్
    Imran Khan: పాపం ఇమ్రాన్ ఖాన్.. బ్యాగ్ పెట్టడానికి కూడా స్థలం లేని ఇరుకు సెల్‌లో జైలు శిక్ష  ఇమ్రాన్ ఖాన్
    వరల్డ్ కప్ ముందు పాక్ ఫాస్ట్ బౌలర్ కీలక నిర్ణయం.. క్రికెట్‌కు వీడ్కోలు క్రికెట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025