Pakistan: ప్రపంచం నివ్వెర పోయే పని చేసిన పాక్.. క్రైస్తవ మహిళకు బ్రిగేడియర్ హోదా
పాకిస్థాన్ ప్రపంచం నివ్వెర పోయే పని చేసిందనే చెప్పాలి.ఓ క్రైస్తవ మహిళకు బ్రిగేడియర్ హోదా కల్పించింది. మహిళలకు ఆ దేశంలో సరైన గుర్తింపు ఇవ్వరని చాలా కాలంగా విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ఆర్మీ మెడికల్ కార్ప్స్‌లో పనిచేసే డాక్టర్ హెలెన్ మేరీ రాబర్ట్స్ బ్రిగేడియర్ ర్యాంక్ కల్పించారు. దేశంలో క్రైస్తవ మైనారిటీ కమ్యూనిటీకి చెందిన మొదటి మహిళగా చరిత్ర సృష్టించారు.
చరిత్ర సృష్టించిన హెలెన్ మేరీ
సెలక్షన్ బోర్డ్ ద్వారా బ్రిగేడియర్‌లుగా పూర్తి కల్నల్‌లుగా పదోన్నతి పొందడం ఆనవాయితీ. ఇలా పాకిస్తాన్ ఆర్మీ అధికారులలో రాబర్ట్స్ కూడా ఉన్నారని ది న్యూస్ ఆదివారం తెలిపింది. పాకిస్తాన్ ప్రధాని ప్రశంస పాకిస్తాన్ ఆర్మీలో బ్రిగేడియర్‌గా పదోన్నతి పొందిన మైనారిటీ మొదటి మహిళగా గౌరవం పొందిన హెలెన్ మేరీ రాబర్ట్స్‌ను ప్రధాని షెహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు. తనతో పాటు దేశం యావత్తూ గర్విస్తుందని చెప్పారు. గత 26 సంవత్సరాలుగా బ్రిగేడియర్ డాక్టర్ హెలెన్ సీనియర్ పాథాలజిస్ట్ గా పనిచేస్తున్నారు. గత ఏడాది రావల్పిండిలోని క్రైస్ట్ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లోఆ దేశ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ మైనార్టీ కమ్యూనిటీ పోషించిన పాత్రను ప్రశంసించారు. దేశాభివృద్ధిలో వారి భాగస్వామ్యం వుందన్నారు.
1.27 శాతం మాత్రమే క్రైస్తవులు
పాకిస్థాన్ లో 96.47 శాతం ముస్లింలు ఉన్నారు. 2.14 శాతం హిందువులు, 1.27 శాతం క్రైస్తవులు, 0.09 శాతం అహ్మదీ ముస్లింలు 0.02 శాతం ఇతరులు ఉన్నారు. పాకిస్థాన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ 2021లో విడుదల చేసిన గణాంకాలు పై విధంగా వున్నాయి.