Pakistan Blast: పాకిస్తాన్‌లో బాంబు పేలుడు.. 6 గురు పోలీసులు మృతి
పాకిస్థాన్ లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లో సోమవారం పోలియో వ్యాక్సినేషన్ కార్మికులకు భద్రత కల్పించడానికి వెళ్తున్న పోలీసులను లక్ష్యంగా చేసుకుని బాంబు పేలుడు జరిగింది. వారిలో ఆరుగురు మరణించగా,22 మంది గాయపడ్డారు.ఈ ఘటన ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దు ప్రావిన్స్‌లోని బజౌర్ జిల్లాలోని మాముంద్ తహసీల్‌లో జరిగింది. పేలుడు సంభవించినప్పుడు పోలీసు సిబ్బంది పోలియో టీకా బృందాలతో భద్రతా విధుల్లో చేరడానికి వ్యాన్‌లో ఎక్కారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు,అక్కడ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.
ఉగ్రవాదిని అంతం చేసే వరకు ఉగ్రవాదులపై యుద్ధం: అర్షద్ హుస్సేన్
ఈ పేలుడులో ఆరుగురు పోలీసులు మృతి చెందగా, 22 మంది గాయపడ్డారు. మృతులంతా పోలీసులేనని పోలీసు అధికార ప్రతినిధి తెలిపారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేపీకే అర్షద్ హుస్సేన్ దాడిని ఖండించారు, చివరి ఉగ్రవాదిని అంతం చేసే వరకు ఉగ్రవాదులపై యుద్ధం కొనసాగుతుందని అన్నారు. ఇప్పటివరకు ఈ దాడికి ఏ మిలిటెంట్ గ్రూప్ బాధ్యత వహించడం లేదు. అయితే పాకిస్తాన్ తాలిబాన్‌తో సహా ఇస్లామిస్ట్ మిలిటెంట్లు గతంలో అనేక మంది పోలియో వ్యాక్సినేషన్ కార్మికులు, వారికి కాపలాగా ఉన్న పోలీసులను చంపారు.