Page Loader
పాకిస్థాన్ ఆపద్ధర్మ ప్రధానిగా అన్వర్ ఉల్ హక్ కాకర్ నియామకం 
పాకిస్తాన్ తాత్కాలిక ప్రధానమంత్రిగా అన్వర్ ఉల్ హక్ కాకర్

పాకిస్థాన్ ఆపద్ధర్మ ప్రధానిగా అన్వర్ ఉల్ హక్ కాకర్ నియామకం 

వ్రాసిన వారు Sriram Pranateja
Aug 12, 2023
06:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్‌లో జాతీయ అసెంబ్లీని రద్దు చేసిన తర్వాత తాత్కాలిక ప్రధాన మంత్రిగా బెలూచిస్తాన్ అవామీ పార్టీ‌కి చెందిన అన్వర్ ఉల్ హక్ కాకర్ నియామకమయ్యారు. ఈ మేరకు ప్రధాని పదవి నుంచి విశ్రాంతి తీసుకున్న షెహజాబ్ షరీఫ్, ప్రతిపక్ష నాయకుడు రియాజ్ సమావేశమై నిర్ణయానికి వచ్చారు. అసెంబ్లీని రద్దు చేసిన మూడు రోజుల్లో తాత్కాలిక ప్రధానమంత్రిని ఎన్నుకోవాలని పాకిస్థాన్ రాష్ట్రపతి సూచించారు. ఈ నేపథ్యంలో అన్వర్ ఉల్ హక్ కాకర్‌ను ఆపద్ధర్మ ప్రధానిగా నియామకయ్యారు. ఈ నిర్ణయానికి రాష్ట్రపతి నుంచి ఆమోదం కూడా లభించింది. పాకిస్థాన్‌లో ఎన్నికలు జరిగే వరకు తాత్కాలిక ప్రధానమంత్రిగా అన్వర్ ఉల్ హక్ కాకర్ కొనసాగనున్నారు.

Details

తాత్కాలిక ప్రధాని ఎన్నికపై ప్రతిపక్ష నాయకుడు ఏమన్నారంటే?

రాజ్యాంగం ప్రకారం, అసెంబ్లీ రద్దు జరిగిన తర్వాత 90రోజుల్లో ఎన్నికలు జరగాలి. కానీ ఈసారి డీలిమిటేషన్ కారణంగా ఎన్నికలు మరింత ఆలస్యం కానున్నాయట. తాత్కాలిక ప్రధానమంత్రిగా అన్వర్ ఉల్ హక్ కాకర్‌ని ఎన్నుకున్న తర్వాత మీడియాతో ప్రతిపక్ష నాయకుడు రియాజ్ మాట్లాడారు. తాత్కాలిక ప్రధానమంత్రిని చిన్న పార్టీ నుంచి, ఎలాంటి వివాదాలు లేని వ్యక్తిని ఎన్నుకోవాలని భావించామని చెప్పారు. అందుకే, అన్వల్ ఉల్ హక్ కాకర్‌ని ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు వెల్లడించారు. పాకిస్థాన్‌లో ఎన్నికలు మరో ఆరునెలల తర్వాత ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.