Page Loader
Pakistan: పాక్ కు చైనా ఇచ్చిన రెండు JF17 విమానాలను కూల్చివేసిన భారత్!
పాక్ కు చైనా ఇచ్చిన రెండు JF17 విమానాలను కూల్చివేసిన భారత్!

Pakistan: పాక్ కు చైనా ఇచ్చిన రెండు JF17 విమానాలను కూల్చివేసిన భారత్!

వ్రాసిన వారు Sirish Praharaju
May 08, 2025
10:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత-పాకిస్థాన్ సరిహద్దుల్లో పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పాకిస్థాన్ తరచూ భారత్‌పై క్షిపణి దాడులకు పాల్పడుతోంది. అయితే, భారత వాయుసేనకు చెందిన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఈ దాడులను సమర్థవంతంగా ఎదుర్కొంటోంది. సరిహద్దు దాటి వచ్చే క్షిపణులను సమయానికి గుర్తించి అడ్డుకుంటోంది. ఈ నేపథ్యంలో ప్రతి దాడికీ భారత్ బలమైన ప్రతిస్పందన ఇస్తోంది. ఈ పోరులో పాకిస్థాన్ తీవ్రంగా నష్టాలను చవిచూస్తోంది. ముఖ్యంగా, భారత్ వైపు చొచ్చుకువచ్చిన రెండు జేఎఫ్-17 యుద్ధవిమానాలను భారత బలగాలు కూల్చివేశాయి. ఈ జెఎఫ్-17 ఫైటర్ జెట్లను చైనా, పాకిస్థాన్‌కు సరఫరా చేసింది.

వివరాలు 

అధికారికంగా స్పందించిన ఐఎస్‌పీఆర్ డైరెక్టర్ జనరల్

అయితే, ఈ యుద్ధవిమానాలు కూలిపోవడంతో అందులో ఉన్న పైలట్లు మృతి చెందారా? లేకపోతే జెట్ నుంచి ఎజెక్ట్ కావడం ద్వారా ప్రాణాలు దక్కించుకున్నారా? అనే విషయాలు ఇంకా స్పష్టతకు రావాల్సి ఉంది. పాకిస్థాన్ సైన్యానికి చెందిన ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ఐఎస్‌పీఆర్) డైరెక్టర్ జనరల్ అయిన లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి ఈ ఘటనపై అధికారికంగా స్పందించారు. "విధి నిర్వహణలో ఉన్న సమయంలో మా రెండు జెఎఫ్-17 యుద్ధవిమానాలు కోల్పోయిన విషయం బాధాకరం" అని ఆయన విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అధికారికంగా స్పందించిన ఐఎస్‌పీఆర్ డైరెక్టర్ జనరల్