LOADING...
Imran Khan: ఇమ్రాన్ ఖాన్ బ్రతికే ఉన్నాడు.. హత్య వార్తలను ఖండించిన పాక్ రక్షణ మంత్రి
ఇమ్రాన్ ఖాన్ బ్రతికే ఉన్నాడు.. హత్య వార్తలను ఖండించిన పాక్ రక్షణ మంత్రి

Imran Khan: ఇమ్రాన్ ఖాన్ బ్రతికే ఉన్నాడు.. హత్య వార్తలను ఖండించిన పాక్ రక్షణ మంత్రి

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 27, 2025
09:41 am

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి, పీటీఐ అధినేత ఇమ్రాన్ ఖాన్ జైల్లో హత్యకు గురయ్యారన్న మాట సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయ్యింది. దీంతో ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తల్లో ఉద్రిక్తత నెలకొంది. రావల్పిండి జైలు సమీపంలో పెద్ద సంఖ్యలో ప్రజలు నిరసనలు తెలిపారు. ఇదే సమయంలో ఖాన్ కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, ఆయనను వెంటనే చూపించాలని డిమాండ్ చేశారు. ఇమ్రాన్ ఖాన్ మరణించినట్టు వస్తున్న వార్తలను రావల్పిండి జైలు అధికారులు పూర్తిగా తోసిపుచ్చారు. ఆయన ఆరోగ్యంగా ఉన్నారని, తగిన ఆహారం అందుతున్నట్లు స్పష్టం చేశారు. ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో ఇచ్చే భోజనంకంటే మెరుగైన ఆహారమే అందిస్తున్నామని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తెలిపారు.

వివరాలు 

అక్కాచెల్లెళ్లను కలిసేందుకు కూడా అనుమతి ఇవ్వలేదు 

ప్రస్తుతం జైల్లో ఆరోగ్యంగా ఉన్నారని వెల్లడించారు. ఇదిలా ఉండగా,ఇమ్రాన్ ఖాన్‌ను ప్రత్యక్షంగా చూడాలని ఆయన సోదరీమణులు డిమాండ్ చేశారు. దీనితో జైలు అధికారులు డిసెంబర్ 2న వారి భేటీకి అనుమతి ఇచ్చారు.మరో జైలుకు తరలిస్తున్నారన్న వార్తలను కూడా అధికారులు ఖండించారు. ఇమ్రాన్ ఖాన్ ఎక్కడికీ మార్చడం లేదని స్పష్టం చేశారు. అవినీతి కేసుల నేపథ్యంలో 2023 నుంచి ఇమ్రాన్ ఖాన్ రావల్పిండి అడియాలా జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. అయితే ఇటీవల ఆయన అక్కాచెల్లెళ్లను కలిసేందుకు కూడా అనుమతి ఇవ్వకపోవడం అనుమానాలకు దారితీసింది. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సు ముఖ్యమంత్రికి కూడా అనుమతి నిరాకరించడంతో పుకార్లు మరింత వేగంగా వ్యాప్తి చెందాయి. చివరికి పాకిస్తాన్ ప్రభుత్వం స్వయంగా స్పందించి,ఇమ్రాన్ ఖాన్ పూర్తిగా సురక్షితంగా,ఆరోగ్యంగా ఉన్నారని ప్రకటించింది.

Advertisement