Page Loader
Pakistan: పాకిస్థాన్‌లో లష్కర్ మాజీ కమాండర్ హతం..భారత్ వ్యతిరేక ప్రసంగాల అక్రమ్ ఖాన్
Lashkar: పాకిస్థాన్‌లో లష్కర్ మాజీ కమాండర్ హతం..భారత్ వ్యతిరేక ప్రసంగాల అక్రమ్ ఖాన్

Pakistan: పాకిస్థాన్‌లో లష్కర్ మాజీ కమాండర్ హతం..భారత్ వ్యతిరేక ప్రసంగాల అక్రమ్ ఖాన్

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Nov 10, 2023
09:55 am

ఈ వార్తాకథనం ఏంటి

లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) మాజీ కమాండర్ అక్రమ్ ఖాన్‌ను పాకిస్థాన్‌లో గురువారం కాల్చి చంపినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వివరాలలోకి వెళితే, అక్రమ్ గాజీ అని కూడా పిలువబడే అక్రమ్ ఖాన్‌ను గుర్తు తెలియని దుండగులు బజౌర్ జిల్లాలో (ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో) కాల్చి చంపారు. 2018 నుంచి 2020 వరకు LET రిక్రూట్‌మెంట్ సెల్‌కు నాయకత్వం వహించిన గాజీ, పాకిస్థాన్‌లో భారతదేశానికి వ్యతిరేకంగా ప్రసంగాలు చేయడం అలవాటే. తీవ్రవాద గ్రూపునకు చెందిన ప్రముఖ వ్యక్తి అక్రమ్, చాలా కాలంగా తీవ్రవాద కార్యకలాపాల్లో పాల్గొంటూ వచ్చాడు.

details

లష్కరే తోయిబాలోకి రిక్రూట్ చేయడమే అక్రమ్ ఖాన్ ప్రధాన విధులు 

తీవ్రవాదం పట్ల సానుభూతిగల వ్యక్తులను గుర్తించడం, వారిని లష్కరే తోయిబాలోకి రిక్రూట్ చేయడం లాంటి కీలక పనులనే అక్రమ్ ఖాన్ చేసేవాడు. ఇటీవలే అక్టోబర్‌లో పఠాన్‌కోట్‌ దాడి సూత్రధారి షాహిద్‌ లతీఫ్‌ను పాకిస్థాన్‌లో కాల్చిచంపారు. లతీఫ్ పాక్ లోని గుజ్రాన్‌వాలా నుంచి భారతదేశంలోకి చొరబడిన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల్లో ఒకడు. 2016లో పఠాన్‌కోట్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లోకి చొరబడిన నలుగురు ఉగ్రవాదులు, దాడులకు పాల్పడ్డారు. మరోవైపు సెప్టెంబర్ లో పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని రావల్‌కోట్‌లోని అల్-ఖుదుస్ మసీదులో లష్కరే తోయిబాకు చెందిన టాప్ టెర్రరిస్టు కమాండర్‌ రియాజ్ అహ్మద్ అలియాస్ అబు ఖాసిమ్‌ని గుర్తు తెలియని ముష్కరులు కాల్చి చంపారు. ప్రార్థనలు చేసేందుకు కోట్లి నుంచి వచ్చిన రియాజ్ ను కాల్చి చంపారు.