Page Loader
పాకిస్థాన్ విశ్వవిద్యాలయాల్లో హోలీ నిషేదం
పాకిస్థాన్ విశ్వవిద్యాలయాల్లో హోలీ నిషేదం

పాకిస్థాన్ విశ్వవిద్యాలయాల్లో హోలీ నిషేదం

వ్రాసిన వారు Stalin
Jun 21, 2023
06:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

యూనివర్శిటీల్లో హోలీ వేడుకలను పాకిస్థాన్ హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ (హెచ్‌ఈసీ) నిషేధించింది. జూన్ 12న క్వాయిడ్-ఐ-అజం యూనివర్శిటీ విద్యార్థులు క్యాంపస్‌లో హోలీని జరుపుకున్న వీడియోలు వైరల్‌గా మారాయి. ఈ క్రమంలో ఈ వేడక జరిగిన కొన్ని రోజుల తర్వాత హెచ్ఈసీ ఈ ఉత్తర్వులను జారీ చేసింది. ఇటువంటి కార్యకలాపాలు దేశ సామాజిక, సాంస్కృతిక విలువలపై ప్రభావాన్ని చూపుతాయని, అలాగే దేశంలో ఇస్లామిక్ గుర్తింపును క్షీణింపజేస్తాయని హెచ్‌ఈసీ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. సాంస్కృతిక, నైతిక విలువలు పెంపొందించేలా యువతను తీర్చి‌దిద్దడంలో ఉన్నత విద్యా సంస్థల 'పాత్ర'ను నొక్కి హెచ్‌ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది. హిందువుల పండుగ హోలీని విస్తృతంగా ప్రచారం చేస్తున్న ఈ ఘటన ఆందోళన కలిగించిందని కమిషన్ పేర్కొంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పాకిస్థాన్ హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ (హెచ్‌ఈసీ) జారీ చేసిన ఉత్తర్వులు