పాకిస్థాన్: ఇమ్రాన్ ఖాన్ ఇంటిపై ఏ క్షణమైనా పంజాబ్ పోలీసుల దాడి; ఉగ్రవాదులే టార్గెట్
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇంటిపై పంజాబ్ పోలీసులు ఏ క్షణమైనా దాడి చేసే అవకాశాలు ఉన్నాయి.
ఇమ్రాన్ ఇంట్లో ఉగ్రవాదులు దాక్కున్నరన్న ఆరోపణలతో పంజాబ్ పోలీసులు శుక్రవారం అతని ఇంటిని చుట్టుముట్టారు.
మే 9న ఇమ్రాన్ అరెస్టు తర్వాత కొందరు పీటీఐ నాయుకులు తమ నిరసనలో భాగంగా లాహోర్ కార్ప్స్ కమాండర్ హౌస్‌పై దాడి చేశారు. వారిపై దేశద్రోహం కేసులు పెట్టిన పంజాబ్ పోలీసులు, ఉగ్రవాదులుగా అభివర్ణించారు.
ఇమ్రాన్ నివాసంలో 30-40మంది ఉగ్రవాదులను దాక్కున్నారని ఆరోపిస్తూ, వారిని 24గంటల్లో అప్పగించాలని, లేకుంటే ఇంట్లో సోదాలు నిర్వహిస్తామని ప్రభుత్వం గురువారం అల్టిమేటమ్ జారీ చేసింది.
గడువులోగా ఉగ్రవాదులను అప్పగించడంలో ఇమ్రాన్ విఫలమైన నేపథ్యంలో అతని ఇంట్లో సోదాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
పాక్
400 మంది పోలీసు బృందంతో సోదాలు
ఇమ్రాన్ ఖాన్ ఇంట్లో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడానికి అతన్ని అడుగుతామని, 400 మంది సిబ్బందితో కూడిన పోలీసు బృందంతో సోదాలు నిర్వహిస్తామని పంజాబ్ కేర్‌టేకర్ ముఖ్యమంత్రి మొహ్సిన్ నఖ్వీ చెప్పారు.
అయితే తన ఇంటికి సోదాలకు వెళ్లినప్పుడు చెల్లుబాటు అయ్యే సెర్చ్ వారెంట్లను తీసుకెళ్లాలని ఇమ్రాన్ పేర్కొన్నారు. సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడానికి ఇమ్రాన్ ఖాన్ బృందం అనుమతించకపోతే, తమ స్టైల్‌లో వ్యవహరిస్తామని చెప్పారు.
ఇదిలా ఉండగా, జమాన్ పార్క్ నుంచి పారిపోతున్న ఎనిమిది మంది ఉగ్రవాదులను అధికారులు పట్టుకున్నారని ముఖ్యమంత్రి మొహ్సిన్ నఖ్వీ వెల్లడించారు. వారిని విచారిస్తున్నట్లు వెల్లడించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఇంటి వెలుపలి దృశ్యాలను షేర్ చేసిన ఇమ్రాన్
Reportedly scenes from outside my house while I was addressing the nation pic.twitter.com/a5vNgwMFLz
— Imran Khan (@ImranKhanPTI) May 17, 2023