LOADING...
Pakistan: భారత్ దెబ్బకు తాళలేక టార్పలిన్‌లతో 'మేకప్' చేస్తున్న పాకిస్తాన్
భారత్ దెబ్బకు తాళలేక టార్పలిన్‌లతో 'మేకప్' చేస్తున్న పాకిస్తాన్

Pakistan: భారత్ దెబ్బకు తాళలేక టార్పలిన్‌లతో 'మేకప్' చేస్తున్న పాకిస్తాన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 11, 2025
04:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత వాయుసేన చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' దెబ్బకు పాకిస్తాన్ తీవ్ర ఉక్కిరిబిక్కిరి అవుతోంది. పహల్గామ్‌లో ఉగ్రదాడి జరిగిన తర్వాత భారత్ కౌంటర్ అడుగులు వేయగా, మొదటగా పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడి 100 మందికి పైగా ఉగ్రవాదులను అంతమొందించింది. అయితే ఆ తర్వాత పాకిస్తాన్ సైన్యం రెచ్చగొట్టే చర్యలకు దిగడంతో, ఈసారి భారత్ మరింత ఉగ్రంగా స్పందించింది. ఇందులో భాగంగా పాకిస్తాన్‌కు చెందిన మొత్తం 11 ఎయిర్ బేస్‌లపై భారత్ దాడులు జరిపింది. మురిద్, జకోబాబాద్, భోలారి వంటి కీలక వైమానిక స్థావరాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. భారత్ చేసిన ఈ సర్జికల్ ఎయిర్ స్ట్రైక్స్ పాక్ వాయుసేనను పూర్తిగా ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఈ దెబ్బలు దాచేయడానికి పాకిస్తాన్ హడావుడిగా ప్రయత్నాలు మొదలుపెట్టింది.

Details

కవర్ తో బిలాన్ని కాన్వాస్ మూసివేత

శాటిలైట్ చిత్రాల్లో కనిపించిన దృశ్యాల ప్రకారం... పాక్ అధికారులు దెబ్బతిన్న ప్రాంతాలను టార్పలిన్ కవర్లతో కప్పేస్తున్నారు. పంజాబ్‌ రాష్ట్రంలోని మురిద్ ఎయిర్‌బేస్ వద్ద క్షిపణి దాడితో ఏర్పడిన మూడు మీటర్ల వెడల్పు గల బిలాన్ని కాన్వాస్‌ కవర్‌తో మూసివేశారు. సింధ్‌లోని భోలారి ఎయిర్ బేస్‌ వద్ద దెబ్బతిన్న హ్యాంగర్‌ను టార్పలిన్‌తో కప్పిన దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ అంశాలను ముందుగా గుర్తించింది జియో ఇంటెలిజెన్స్ పరిశోధకుడు డామియన్ సైమన్. భారత్ నిర్వహించిన 'ఆపరేషన్ సిందూర్' అనంతరం పాక్ వైమానిక స్థావరాల పరిస్థితి ఏలానో ఈ ఫోటోలు వెల్లడిస్తున్నాయి. తమ మౌలిక సదుపాయాలకు జరిగిన నష్టాన్ని దాచేందుకు పాక్ చేస్తున్న ఈ కవరింగ్ యత్నాలు అంతర్జాతీయంగా మరోసారి హాస్యాస్పదంగా మారాయి.