LOADING...
Amnesty International: బలూచ్ గొంతులను అణచివేయడానికి పాకిస్తాన్ ఉగ్రవాద నిరోధక చట్టాలను దుర్వినియోగం చేస్తోంది: ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్
ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్

Amnesty International: బలూచ్ గొంతులను అణచివేయడానికి పాకిస్తాన్ ఉగ్రవాద నిరోధక చట్టాలను దుర్వినియోగం చేస్తోంది: ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 24, 2025
04:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

మానవహక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ పాకిస్థాన్‌ ఉగ్రవాద నిరోధక చట్టాలను తప్పుడు విధంగా దుర్వినియోగం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ చట్టాలను ముఖ్యంగా బలోచ్‌ ఉద్యమకారులని అణచివేత చేసేందుకు ఉపయోగిస్తున్నట్లు సంస్థ ఆరోపించింది. 1997లో ప్రవేశపెట్టిన ఉగ్రవాద నిరోధక చట్టం కింద, బలోచ్‌ జాతికి చెందిన 32 మందిని పాక్‌ తన వాచ్‌లిస్ట్‌లో చేర్చింది, ఇది తప్పు అని ఆమ్నెస్టీ తెలిపింది. వీరిలో కొన్ని ప్రత్యేక దేశం కోసం శాంతియుతంగా పోరాడే వ్యక్తులున్నారని, వారిని కూడా ఉగ్రవాదులుగాచేర్చిందని.. ఇది వారి హక్కులను పూర్తిగా కాలరాయడమే అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేసింది.

వివరాలు 

పాక్‌ తన వాచ్‌లిస్ట్‌లో పలు మహిళా బలోచ్‌ కార్యకర్తలను చేర్చింది

ఆమ్నెస్టీ దక్షిణాసియా రీజనల్ డైరెక్టర్ బాబూ రామ్ మాట్లాడుతూ, ప్రత్యేక దేశం కోసం శాంతియుతంగా పోరాటం చేస్తున్న బలోచ్‌ ప్రజలను పాక్‌ ఉగ్రవాదులుగా చిత్రీకరిస్తోందని హెచ్చరించారు. దీనివల్ల వారి స్వేచ్ఛ, గోప్యత, ప్రాథమిక ఉద్యమ హక్కులు సడలకుండా ప్రభావితమవుతున్నాయని చెప్పారు. పాక్‌ తన వాచ్‌లిస్ట్‌లో పలు మహిళా బలోచ్‌ కార్యకర్తలను కూడా చేర్చి.. తన హద్దులను దాటిందని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనివల్ల వారు కఠిన పర్యవేక్షణ, ప్రయాణ పరిమితులు, బ్యాంకు ఖాతాల ఫ్రీజ్‌ వంటి కఠిన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని సూచించింది. అంతే కాకుండా, బలోచ్‌ ఉద్యమకారుల నిర్ణయాలను ప్రశ్నించేందుకు అవకాశం కూడా ఇవ్వకుండా, ఉగ్రవాద నిరోధక చట్టాలను ఉపయోగిస్తున్నట్టు పేర్కొంది.

వివరాలు 

అంతర్జాతీయ మానవహక్కుల చట్టాలకు అనుగుణంగా ఉగ్రవాద నిరోధక చట్టాలను సవరించాలి 

ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ పాక్‌ ఈ విధమైన కుట్రలను నిలిపివేయాలని, అంతర్జాతీయ మానవహక్కుల చట్టాలకు అనుగుణంగా ఉగ్రవాద నిరోధక చట్టాలను సవరించాలని డిమాండ్‌ చేసింది. బలోచిస్థాన్‌ ప్రాంతాన్ని ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయడానికి బలోచ్‌ లిబరేషన్‌ ఆర్మీ ఏర్పడింది. పాక్‌లోని అత్యధిక ఖనిజ వనరులు ఉన్న ప్రావిన్స్గా బలోచిస్థాన్‌ ప్రసిద్ధి చెందింది. ఇక్కడ చమురు, బొగ్గు, బంగారం, రాగి, సహజ వాయువు వంటి వనరులు సమృద్ధిగా ఉన్నాయి. ఈ వనరుల కారణంగానే, ప్రత్యేక దేశం కోసం బలోచ్‌ ప్రజలు దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నారని సమాచారం.