మరోసారి విషం కక్కిన పాక్.. మాదకదవ్య్రాల సరఫరాలపై పాక్ సంచనల విషయాలు
భారత్ పై దయాది పాకిస్థాన్ మరోసారి విషం కక్కింది. పాక్ ఇండియాలోకి పెద్ద ఎత్తున ఆయుధాలు, మదకద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై పాక్ అధికారి సంచనల విషయాలను వెల్లడించారు. భారత్‌కు తాము డ్రోన్లతో డ్రగ్స్ ను స్మగ్లింగ్ చేస్తున్న మాట వాస్తవమేనని పాక్ ప్రధాని సలహాదారుడు పేర్కొన్నారు. పాకిస్థాన్ ఫ్రధాని షెహబాబ్ షరీప్‌కు రక్షణ సలహాదారుగా ఉన్న మాలిక మహ్మద్ అహ్మద్ ఖాన్ ఇటీవల పాక్ జియో న్యూకు చెందిన సీనియర్ జర్నలిస్టు హమీద్ మీర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఇందులో భారత్ కు అక్రమంగా మాదకద్రవ్యాల సరఫరాపై సంచలన విషయాలను బయటపెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
డ్రగ్ స్మగ్లింగ్ ను నిర్మూలించడానికి భారత సైన్యం కృషి
పాకిస్థాన్-భారత్ సరిహద్దుల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న స్మగ్లర్లు హెరాయిన్‌ను సరఫరా చేసేందుకు డ్రోన్స్ ఉపయోగిస్తున్నారని, వరద బాధితులకు ప్రత్యేక ప్యాకేజీ, పునరావాసం కల్పించకపోతే వారు కూడా స్మగ్లర్ల ముఠాతో చేరే అవకాశముందని మాలిక్ చెప్పడం గమనార్హం. జమ్మూకాశ్మీర్, పంజాబ్ సరిహద్దుల్లో తరుచూ స్మగ్లర్లు భారత్‌లోకి అక్రమంగా మాదకద్రవ్యాలు, ఆయుధాలను తరలిస్తున్నా సరిహద్దు భద్రతా దళాలు వాటిని తిప్పికొడుతున్నాయి. ముఖ్యంగా పాక్ నుంచి డ్రగ్ స్మగ్లింగ్ ను నిర్మూలించడానికి భారత సైన్యం పటిష్ట చర్యలను తీసుకుంటూనే ఉంది.