Page Loader
Pakistan Train Hijack: రైలు హైజాక్ వెనుక భారతదేశం హస్తం.. పాకిస్థాన్ విదేశాంగ కార్యాలయం ఆరోపణలు 
రైలు హైజాక్ వెనుక భారతదేశం హస్తం.. పాకిస్థాన్ విదేశాంగ కార్యాలయం ఆరోపణలు

Pakistan Train Hijack: రైలు హైజాక్ వెనుక భారతదేశం హస్తం.. పాకిస్థాన్ విదేశాంగ కార్యాలయం ఆరోపణలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 13, 2025
05:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్‌లో అతిపెద్ద ప్రావిన్స్ అయిన బెలూచిస్తాన్‌లో "జాఫర్ ఎక్స్‌ప్రెస్" హైజాక్‌కు గురైంది. క్వెట్టా నుంచి పెషావర్‌కు వెళ్తున్న ఈ రైలును బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) పోరాట యోధులు హైజాక్ చేశారు. అయితే, ఈ ఘటన వెనుక భారతదేశం హస్తముందని పాకిస్తాన్ విదేశాంగ శాఖ గురువారం ఆరోపించింది. ఈ హైజాక్ ఘటనలో 21 మంది ప్రయాణికులు, నలుగురు పారామిలిటరీ సైనికులు బలూచ్ పోరాట యోధుల చేతిలో ప్రాణాలు కోల్పోయారు.

వివరాలు 

ఆపరేషన్ విజయవంతం 

విదేశాంగ శాఖ ప్రతినిధి షఫ్కత్ అలీ ఖాన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, హైజాక్‌కు పాల్పడిన బలూచ్ ఉగ్రవాదులు ఆఫ్ఘనిస్తాన్‌లోని తమ సహచరులతో సంబంధాలు కలిగి ఉన్నారని నిఘా నివేదికలు వెల్లడించాయని చెప్పారు. భారత్ పేరు నేరుగా ప్రస్తావించకుండానే, ఈ ఘటన వెనుక భారతదేశం హస్తముందని సూచించేలా వ్యాఖ్యానించారు. బీఎల్ఏ వంటి సంస్థలు తమ సరిహద్దుల్లో కార్యకలాపాలు నిర్వహించకుండా అడ్డుకోవాలని పాకిస్తాన్ ప్రభుత్వం మళ్లీ మళ్లీ ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వాన్ని కోరిందని తెలిపారు. జాఫర్ ఎక్స్‌ప్రెస్‌పై దాడి అనంతరం భద్రతా దళాలు చేపట్టిన ఆపరేషన్ విజయవంతమైనట్లు పేర్కొన్నారు.

వివరాలు 

భారత్ ఆఫ్ఘనిస్థాన్ నుంచి ఈ దాడులను అమలు చేస్తోంది: రాణా సనావుల్లా

ఇక, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సలహాదారు రాణా సనావుల్లా మాట్లాడుతూ,ఈ హైజాక్ ఘటనలో భారత్ ప్రమేయం ఉందని ఆరోపించారు. భారత్ ఆఫ్ఘనిస్థాన్ నుంచి ఈ దాడులను అమలు చేస్తోందని నిందించారు.డాన్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో,భారత్ తెహ్రిక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP),బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) రెండింటికీ మద్దతు ఇస్తోందని పేర్కొన్నారు. పాకిస్తాన్ ఆర్మీ ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ మాట్లాడుతూ,భద్రతా దళాలు సంఘటన స్థలంలో ఉన్న 33మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు తెలిపారు. మంగళవారం ఉగ్రవాదులు రైలుపై దాడి చేయగా,21మంది ప్రయాణికులు మరణించారని చెప్పారు. 450మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్నజాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను బెలూచిస్తాన్‌లోని సెబి జిల్లాలోని మారుమూల ప్రాంతంలో బీఎల్ఏ అదుపులోకి తీసుకుందని పేర్కొన్నారు. పాకిస్తాన్ ప్రకారం,ఈ దాడిలో 70-80మంది ఉగ్రవాదులు పాల్గొన్నారని తెలిపారు.