LOADING...
Pakistan: $500 మిలియన్ల ఒప్పందం కింద అరుదైన ఖ‌నిజాల‌ను అమెరికాకు ఎగుమ‌తి చేసిన పాకిస్థాన్
$500 మిలియన్ల ఒప్పందం కింద అరుదైన ఖ‌నిజాల‌ను అమెరికాకు ఎగుమ‌తి చేసిన పాక్

Pakistan: $500 మిలియన్ల ఒప్పందం కింద అరుదైన ఖ‌నిజాల‌ను అమెరికాకు ఎగుమ‌తి చేసిన పాకిస్థాన్

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 07, 2025
10:39 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆర్థిక, వ్యూహాత్మక భాగస్వామ్యంలో అమెరికా,పాకిస్థాన్ మధ్య కొత్త బంధం ఏర్పడింది. ముఖ్యంగా అరుదైన ఖనిజాల (Rare Earth Minerals) ఎగుమతిని కేంద్రంగా చేసుకుని ఈ రెండు దేశాలు ప్రత్యేక ఒప్పందం (Agreement) చేపట్టాయి. అమెరికాకు చెందిన స్ట్రాట‌జిక్ మెట‌ల్స్ శాఖ‌, పాక్ ప్ర‌భుత్వం మ‌ధ్య సెప్టెంబ‌ర్‌లో ఒప్పందం కుదిరింది దీనిలో భాగంగా, పాకిస్థాన్ నుండి అమెరికాకు అరుదైన ఖనిజాల మొదటి షిప్మెంట్ బయలుదేరిందని సమాచారం లభించింది. అమెరికా కంపెనీ సుమారు 500 మిలియ‌న్ల డాల‌ర్ల పెట్టుబ‌డితో పాకిస్థాన్‌లో మిన‌ర‌ల్ ప్రాసెసింగ్‌, డెవ‌లప్మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేసే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో, ప్రపంచవ్యాప్తంగా ఖనిజాల సరఫరాలో పాకిస్థాన్ కీలక పాత్ర పోషిస్తున్నదని అమెరికా అధికారికంగా ప్రకటించింది.

వివరాలు 

పాకిస్థాన్‌కు బిలియ‌న్ల‌లో ఆదాయం

పాకిస్థాన్ పంపిన ఖనిజాల్లో యాంటిమోనీ (Antimony), కాపర్ కాన్సెంట్రేట్ (Copper Concentrate), రేర్ ఎర్త్ మెటల్స్‌ అయిన నియోడైమియం (Neodymium) ప్రసియోడైమియం (Praseodymium) ఉన్నాయి. అమెరికా, పాకిస్థాన్ మధ్య ఈ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కీలక మైలురాయిగా పేర్కొంది. తద్వారా, పాకిస్థాన్‌లో మినరల్ రిఫైనరీస్ (Mineral Refineries) ఏర్పాటు చేయడం సులభమవుతుందని సూచించింది. అరుదైన ఖనిజాల ఎగుమతితో పాకిస్థాన్ పెద్ద మొత్తంలో ఆదాయం పొందే అవకాశం ఉందని అనేక విశ్లేషకులు భావిస్తున్నారు. దీనివల్ల ఉద్యోగావకాశాలు కూడా పెరుగుతాయని భావిస్తున్నారు. ప్రస్తుత అంచనాల ప్రకారం, ఆ దేశంలో సుమారు ఆరు ట్రిలియన్ల డాలర్ల విలువ చేసే ఖనిజ నిక్షేపాలు (Mineral Reserves) ఉన్నాయని అంచనా వేస్తున్నారు.

వివరాలు 

అమెరికాతో జ‌రుపుకున్న సీక్రెట్ ఒప్పందాల‌ను బ‌హిర్గ‌తం చేయాలి:షేక్ అక్రం

కానీ, అమెరికాతో కుదుర్చుకున్న ఈ ఒప్పందంపై పాకిస్థాన్ లోని ప్రతిపక్ష పార్టీ పీటీఐ (PTI) తీవ్రంగా విమర్శలు వ్యక్తం చేసింది. వారు ఈ ఒప్పందాలను రహస్యంగా నెరవేర్చారని ఆరోపించారు. అందుకే, పీటీఐ నేత షేక్ అక్రం (Sheikh Akram) ఈ ఒప్పందాల డాక్యుమెంట్లను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.