
Indian Jets : ఐదు భారతీయ విమానాలను మట్టుబెట్టాం : పాక్
ఈ వార్తాకథనం ఏంటి
ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా మంగళవారం రాత్రి పాక్ ఉగ్ర స్థావరాలపై భారత్ వైమానిక దాడులకు దిగింది. రాత్రి ఒంటి గంట తరువాత ఈ దాడులు ప్రారంభమయ్యాయని సమాచారం.
అయితే భారత దళాల దాడికి పాక్ వెంటనే ప్రతిస్పందించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో భారత్‌కు చెందిన ఐదు యుద్ధవిమానాలను తాము కూల్చివేశామని పాకిస్థాన్ అధికారికంగా ప్రకటించింది.
ఈ విషయాన్ని పాక్ మీడియాలో విశ్లేషణాత్మక కథనాలుగా ప్రచురించాయి. భారత వైమానిక దళం ఆపరేషన్‌ను తన వైమానిక క్షేత్రం నుంచి ప్రారంభించిందని పాక్ పేర్కొంది.
తెల్లవారుజామున 2:45 గంటల సమయంలో మొదటి రెండు ఇండియన్ జెట్లు కూల్చివేశామని పాక్ మంత్రి అతాహుల్లా తరార్ ధ్రువీకరించారు.
అనంతరం మూడవ యుద్ధవిమానాన్ని తెల్లవారుజామున 3:42 గంటలకు కూల్చివేశారంటూ వివరించారు.
Details
ఆక్నూర్, అంబాలా, బర్నాలా, జమ్మూ ప్రాంతాల్లో కింద పడ్డ విమానాలు
అలాగే అవంతిపురాకు 17 నాటికల్ మైళ్ల దూరంలో భారతీయ రఫేల్ యుద్ధవిమానాన్ని పాక్ వైమానిక దళం కూల్చిందని ఆయన వెల్లడించారు.
అయిదో విమానాన్ని తెల్లవారుజామున 5 గంటల తర్వాత మట్టుబెట్టినట్టు పాక్ ఆర్మీ ధృవీకరించింది. ఇండియన్ జెట్లు తమ స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాకే అవి కూల్చివేయబడ్డాయని పాక్ అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.
కూల్చిన యుద్ధవిమానాలు ఆక్నూర్, అంబాలా, బర్నాలా, జమ్మూ ప్రాంతాల్లో కిందపడ్డాయని పాక్ మీడియా వెల్లడించింది.
పాకిస్థాన్ ప్రకటనల ప్రకారం, కూల్చిన ఐదు యుద్ధవిమానాల్లో మూడు రఫేల్ జెట్లు, ఒక సుఖోయ్-30, ఒక మిగ్-29 ఉన్నాయని వెల్లడించారు.
ఇక ఈ వైమానిక చర్యల మధ్యలో 8 మంది పాకిస్తాన్ పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు పాక్ ఆర్మీ అధికారికంగా ప్రకటించింది.