Page Loader
Imsha Rehman: పాకిస్థానీ ఇన్‌ఫ్లుయెన్సర్ ఇమ్షా రెహ్మాన్ ప్రైవేట్ వీడియోలు లీక్
పాకిస్థానీ ఇన్‌ఫ్లుయెన్సర్ ఇమ్షా రెహ్మాన్ ప్రైవేట్ వీడియోలు లీక్

Imsha Rehman: పాకిస్థానీ ఇన్‌ఫ్లుయెన్సర్ ఇమ్షా రెహ్మాన్ ప్రైవేట్ వీడియోలు లీక్

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 16, 2024
09:47 am

ఈ వార్తాకథనం ఏంటి

సోషల్ మీడియాలో వ్యక్తిగత వీడియోల లీక్‌లు వరుసగా వార్తల్లో నిలుస్తున్నాయి. తాజాగా పాకిస్థానీ ఇన్‌ఫ్లుయెన్సర్, టిక్‌టాకర్ ఇమ్షా రెహ్మాన్ వ్యక్తిగత వీడియోలు లీక్ కావడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదం తర్వాత ఇమ్షా తన సోషల్ మీడియా ఖాతాలను డీయాక్టివేట్ చేసింది. ఇమ్షా రెహ్మాన్ ఒక ప్రైవేట్ వీడియోలో అభ్యంతరకర స్థితిలో కనిపించడాన్ని పలువురు ప్రైవసీ ఉల్లంఘనగా అభివర్ణించారు. ఈ వీడియోలు పాకిస్థాన్ సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతుండటంతో ఇమ్షా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. తన వ్యక్తిగత జీవితం ఈ విధంగా బయటపడటంతో ఆమె సోషల్ మీడియా ఖాతాలను తొలగించింది. ఇమ్షా తన ప్రయాణాన్ని ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్ ద్వారా ప్రారంభించింది.

Details

ఖాతాలను తొలగించిన ఇమ్షా

జీవనశైలి, ఫ్యాషన్ కంటెంట్‌ను షేర్ చేస్తూ అనేకమంది ఫాలోవర్స్‌ను సంపాదించుకుంది. ఆమె టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన ఇన్‌ఫ్లుయెన్సర్లలో ఒకరుగా నిలిచారు. 12.1 మిలియన్లకు పైగా లైక్‌లతో ఆమె పాకిస్థాన్‌లో ప్రముఖ టిక్‌టాక్ స్టార్‌గా పేరు పొందారు. ఇమ్షా ఒక్కో బ్రాండ్ ప్రమోషన్ కోసం లక్షల రూపాయలు వసూలు చేస్తారని సమాచారం. ఇమ్షా విషయంలో వైరల్ అయిన వీడియోలు ఆమె కెరీర్‌పై తీవ్రమైన ప్రభావం చూపించవచ్చు. ఇటీవలి కాలంలో పాకిస్థాన్‌లో ఇలాంటి వీడియోల లీక్‌లు తరుచుగా జరుగుతున్నాయి. ఇమ్షా కంటే ముందుగా మినాహిల్ మాలిక్ అనే మరో ఇన్‌ఫ్లుయెన్సర్ కూడా ఇలాంటి వివాదంలో ఇరుక్కుంది. డిజిటల్ ప్రైవసీకి సంబంధించి మరింత కఠినమైన చట్టాలు అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.