Palestine: ఖతార్‌కు చెందిన అల్‌జజీరా వార్తా సంస్థపై పాలస్తీనా అథారిటీ నిషేధం
ఈ వార్తాకథనం ఏంటి
ఇజ్రాయెల్-హమాస్‌ల మధ్య పోరాటం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఓ ముఖ్యమైన పరిణామం జరిగింది.
ఖతార్‌కు చెందిన అల్‌జజీరా వార్తా సంస్థపై పాలస్తీనా అధికారులు నిషేధం విధించారు.
రెచ్చగొట్టే ప్రసారాలు చేస్తున్న ఆరోపణలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తా సంస్థలు తెలియజేశాయి.
సాంస్కృతిక, అంతర్గత, సమాచారశాఖలతో కూడిన ప్రత్యేక మంత్రివర్గ కమిటీ అల్‌జజీరా ప్రసారాలను నిలిపివేయాలని నిర్ణయించింది.
తప్పుడు సమాచారం, రెచ్చగొట్టే కంటెంట్‌ను ప్రసారం చేయడంతో పాటు పాలస్తీనా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నట్లు ఆరోపించారు.
ఉన్న చట్టాలు, నిబంధనలు ఉల్లంఘించారని పేర్కొన్నారు. దీంతో ఆ సంస్థపై నిషేధం విధించినట్లు స్పష్టం చేశారు.
వివరాలు
అల్‌జజీరాపై నిషేధాన్ని హమాస్ ఖండించింది
ఆ కంపెనీ జర్నలిస్టులు, ఉద్యోగులు, సిబ్బంది ఎలాంటి విధులు నిర్వహించకూడదని ఆదేశాలు జారీ చేశారు.
రమల్లాలోని కార్యాలయానికి ప్రసారాలను నిలిపివేయాలని అల్‌జజీరా ఉద్యోగి ఒకరు తెలిపారు.
అల్‌జజీరాపై నిషేధాన్ని హమాస్ ఖండించింది. ఈ చర్య ప్రజా హక్కులు, స్వేచ్ఛను తగ్గించే చర్యగా పేర్కొంది.
అల్‌జజీరా అక్రమాలను బయటపెట్టడం, ప్రజల స్థిరత్వానికి మద్దతుగా మీడియా కవరేజీ చేయడం కీలకమని పేర్కొంది.
ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని హమాస్ డిమాండ్ చేసింది.
వెస్ట్ బ్యాంక్‌లో అల్‌జజీరా రెచ్చగొట్టే ప్రసారాలు చేస్తున్నట్లు పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్ ఆరోపించారు.
డిసెంబరు చివరిలోనే ఈ ఆరోపణలను అల్‌జజీరా ఖండించింది. అయినప్పటికీ, పాలస్తీనా అథారిటీ ఇలాంటి చర్య తీసుకోవడం గమనార్హం.