LOADING...
Paris : ఒలింపిక్స్ ముందు పారిస్‌లో ఆస్ట్రేలియన్ మహిళపై గ్యాంగ్‌రేప్
ఒలింపిక్స్ ముందు పారిస్‌లో ఆస్ట్రేలియన్ మహిళపై గ్యాంగ్‌రేప్

Paris : ఒలింపిక్స్ ముందు పారిస్‌లో ఆస్ట్రేలియన్ మహిళపై గ్యాంగ్‌రేప్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 24, 2024
09:37 am

ఈ వార్తాకథనం ఏంటి

ఒలింపిక్స్ ముందు పారిస్ లో ఆస్ట్రేలియన్ మహిళపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడరు. జూలై 20 అర్ధరాత్రి తర్వాత ఆ మహిళపై ఆత్యాచారానికి పాల్పడినట్లు తెలిసింది. అయితే ఆ బాధిత మహిళ కబాబ్ షాప్ వద్ద సీసీటీవీలో కనిపించింది. ఈ ఘటన జరిగిన తర్వాత ఆమె పిగ్లే ప్రాంతంలోని కాబాబ్ షాపులో ఆశ్రయం పొందింది.

Details

చిరిగిన దుస్తులతో సాయం కోరిన మహిళ

ఇక సీసీటీవీ ఫుటేజ్‌లో ఆమె దుకాణంలోకి పరిగెత్తడం కనిపించింది. తర్వాత చిరిగిపోయిన తన దుస్తులతో సిబ్బందిని సాయం కోరింది. ఆ తర్వాత ఒక వ్యక్తి దుకాణంలోకి ప్రవేశించగా, అతనే తనపై దాడి చేశాడని ఆ మహిళ కాబాబ్ షాప్ సిబ్బందికి చెప్పింది. ఇక సిబ్బంది అతడిని ప్రశ్నించడంతో నిందితుడు రెస్టారెంట్ నుంచి పారిపోయాడు.

Details

ఆస్పత్రికి తరలించిన పోలీసులు

అనంతరం షాపు యజమానులు ఎమర్జెన్సీ నెంబర్లకు ఫోన్ చేసి పోలీసులను పిలిపించారు. అక్కడ చేరుకున్న పోలీసులు బాధిత మహిళను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇక పారిస్‌లో 2024 ఒలింపిక్ క్రీడలు త్వరలో ప్రారంభమయ్యే ముందు ఈ ఘటన జరగడం నగరంలో సంచలనం సృష్టించింది.