LOADING...
Elon Musk: గాజా శాంతి మండలిపై ఎలాన్‌ మస్క్‌ వ్యంగ్యం.. "ఇది శాంతి కాదు, కేవలం పీస్‌"
గాజా శాంతి మండలిపై ఎలాన్‌ మస్క్‌ వ్యంగ్యం.. "ఇది శాంతి కాదు, కేవలం పీస్‌"

Elon Musk: గాజా శాంతి మండలిపై ఎలాన్‌ మస్క్‌ వ్యంగ్యం.. "ఇది శాంతి కాదు, కేవలం పీస్‌"

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 23, 2026
08:22 am

ఈ వార్తాకథనం ఏంటి

దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గాజాకు సంబంధించిన 'శాంతి మండలి'ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పరిణామంపై ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ స్పందిస్తూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ఇది నిజమైన శాంతి మండలి కాదని, 'పీస్‌' అంటే ఒక చిన్న ముక్కలా ఉందంటూ ఎద్దేవా చేశారు. ఈ ఆర్థిక సదస్సుకు ఎలాన్‌ మస్క్‌ తొలిసారి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, "శాంతి మండలి ఏర్పాటు చేస్తున్నారని విన్నాను. కానీ అది శాంతి కాదు, కేవలం ఒక 'పీస్‌' అనిపించింది. గ్రీన్‌లాండ్‌, వెనెజువెలాల్లాగే అది కూడా ఒక చిన్న ముక్క మాత్రమే" అంటూ వ్యాఖ్యానించారు.

వివరాలు 

వెనెజువెలాను మేమే పరిపాలిస్తాం: ట్రంప్ 

మస్క్‌ చేసిన ఈ వ్యాఖ్యలతో వేదిక వద్ద ఉన్నవారంతా ఒక్కసారిగా నవ్వులు పూయించారు. ఈ సందర్భంగా తమకు ఎప్పటికీ కావాల్సింది శాంతి మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదిలా ఉండగా, వెనెజువెలాపై దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడు నికోలస్‌ మదురోతో పాటు ఆయన భార్యను అమెరికా దళాలు నిర్బంధించిన ఘటన ఇప్పటికే తెలిసిందే. ఆ తర్వాత వెనెజువెలాను తామే పరిపాలిస్తామని డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. మరోవైపు గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకునేందుకు కూడా ఆయన పలు ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఎలాన్‌ మస్క్‌ చేసిన వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

'శాంతి మండలి'పై ఎలాన్‌ మస్క్‌ వ్యంగ్య వ్యాఖ్యలు

Advertisement