LOADING...
JD Vance: అమెరికా షరతులను తిరస్కరించని ఇరాన్.. జేడీ వాన్స్ బృందం పాక్ పర్యటన వాయిదా..!
అమెరికా షరతులను తిరస్కరించని ఇరాన్.. జేడీ వాన్స్ బృందం పాక్ పర్యటన వాయిదా..!

JD Vance: అమెరికా షరతులను తిరస్కరించని ఇరాన్.. జేడీ వాన్స్ బృందం పాక్ పర్యటన వాయిదా..!

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 22, 2026
09:18 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా- ఇరాన్‌ మధ్య ఇప్పట్లో చర్చలు జరిగే సూచనలు కన్పించట్లేదు.అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ బృందం పాకిస్థాన్‌ పర్యటన వాయిదా పడినట్లు సమాచారం. చర్చలకు సంబంధించి ఇరాన్‌ నుంచి స్పష్టమైన స్పందన రాకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. వైట్‌హౌస్‌ వర్గాల సమాచారాన్నిఆధారంగా చేసుకుని ఈవిషయం వెలుగులోకి వచ్చింది. అమెరికా-ఇరాన్‌ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం గడువు ముగియకముందే చర్చలు ప్రారంభించేందుకు వాన్స్‌ బృందం ఇస్లామాబాద్‌కు వెళ్లాల్సి ఉంది. అయితే,చర్చలపై ఇరాన్‌ నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో ఈపర్యటనను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. తమ వాణిజ్యనౌకలపై విధించిన దిగ్బంధాన్నిఎత్తివేస్తేనే చర్చలకు సిద్ధమని ఇరాన్‌ గతంలోనే వెల్లడించింది. ఈపరిస్థితుల నేపథ్యంలోనే వాన్స్‌ నేతృత్వంలోని బృందం పాకిస్థాన్‌ పర్యటన వాయిదా పడిందని వైట్‌హౌస్‌ వర్గాలు తెలిపాయి.

వివరాలు 

కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగిస్తున్నట్లు ప్రకటించిన ట్రంప్

అయితే, ఈ పర్యటనను పూర్తిగా రద్దు చేయలేదని, అవసరమైతే ఎప్పుడైనా బృందం బయలుదేరవచ్చని స్పష్టం చేశాయి. ఇస్లామాబాద్‌కు తమ ప్రతినిధి బృందాన్ని పంపాలా లేదా అన్న విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఇరాన్‌ విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిల్‌ బఘాయీ తెలిపారు. హర్మూజ్‌ సముద్ర మార్గంలో అమెరికా చేపట్టిన దిగ్బంధం,వాణిజ్య నౌక స్వాధీనం వంటి చర్యలను ఆయన ప్రస్తావించారు. ఈ చర్యల కారణంగా చర్చల విషయంలో అమెరికా నిజాయితీపై అనుమానం వ్యక్తం చేశారు. మరోవైపు, ఇరాన్‌తో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగిస్తున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు. ఇరాన్‌ నుంచి స్పష్టమైన ప్రణాళిక వచ్చేవరకు ఈ ఒప్పందం కొనసాగుతుందని తెలిపారు. అయితే, హర్మూజ్‌ వద్ద దిగ్బంధం మాత్రం యథావిధిగా కొనసాగుతుందని అమెరికా స్పష్టం చేసింది.

Advertisement