Page Loader
Karachi: షాపింగ్ మాల్‌లో అగ్నిప్రమాదం.. 11 మంది మృతి 
Karachi: షాపింగ్ మాల్‌లో అగ్నిప్రమాదం.. 11 మంది మృతి

Karachi: షాపింగ్ మాల్‌లో అగ్నిప్రమాదం.. 11 మంది మృతి 

వ్రాసిన వారు Stalin
Nov 25, 2023
01:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

బహుళ అంతస్తుల షాపింగ్ మాల్‌లో అగ్నిప్రమాదం జరిగి 11 మంది మృతి చెందారు. పాకిస్థాన్ కరాచీలో శనివారం ఈ ప్రమాదం జరిగింది. అంతేకాకుండా, మంటల్లో అనేక మంది చిక్కుకున్నారని అధికారులు వెల్లడించారు. కరాచీలోని రషీద్ మిన్హాస్ రోడ్‌లోని ఆర్‌జే షాపింగ్ మాల్‌లో ఈ ఘటన జరిగింది. కరాచీ మేయర్ ముర్తాజా వహాబ్ 11 మంది మరణించినట్లు ట్విట్ చేశారు. అయితే మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. రెండు స్నార్కెల్స్, ఎనిమిది ఫైర్ టెండర్లు, ఒక బౌసర్‌తో కూడిన రెస్క్యూ బృందం మంటలను అదుపులోకి తెచ్చింది. మంటల్లో చిక్కుకున్న 50మందిని రెస్క్యూ టీమ్ రక్షించింది. ప్రస్తుతం షాపింగ్ సెంటర్‌లో కూలింగ్ ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పలువురికి గాయాలు