Page Loader
America: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం - ముగ్గురు మృతి, పలువురికి గాయాలు 
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం - ముగ్గురు మృతి, పలువురికి గాయాలు

America: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం - ముగ్గురు మృతి, పలువురికి గాయాలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 02, 2025
08:56 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా వీధులు మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లాయి. లాస్ ఏంజెలెస్‌ నగరం, నార్త్ కరోలినాలోని కొన్ని ప్రాంతాల్లో దుండగులు తుపాకులతో రెచ్చిపోగా, కొలరాడోలో యూదులపై బాంబు దాడి జరగడం దేశవ్యాప్తంగా భయానక వాతావరణాన్ని కలిగించింది. ఈ ఘటనల్లో మొత్తం ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది గాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. నార్త్ కరోలినాలోని హికోరి ప్రాంతంలో ఒక ప్రైవేట్ ప్రాపర్టీలో జరిగిన కాల్పుల్లో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో మరో 11 మంది గాయపడ్డారు. గాయాల తీవ్రతకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇంకొవైపు, లాస్ ఏంజెలెస్ నగరానికి చెందిన బాల్డివిన్ పార్క్ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి తుపాకీతో కాల్పులకు పాల్పడ్డాడు.

వివరాలు 

దేశవ్యాప్తంగా భద్రతా వ్యవస్థ మరింత కఠినం

ఈ కాల్పుల్లో ఒక పోలీసు అధికారి ప్రాణాలు కోల్పోగా, మరొకరు గాయపడ్డారు. అనంతరం అదే ప్రాంతంలో ఇంకొక మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. మృతిచెందిన వ్యక్తి ఎవరో ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. దీనితోపాటు, కొలరాడోలో యూదులపై ఒక దుండగుడు బాంబుల దాడికి పాల్పడ్డాడు. ఆయన పాలస్తీనా విముక్తి కోసం నినాదాలు చేస్తూ, మండే ద్రావణాలతో నిండిన సీసాలను విసిరాడు. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు అనుమానితుడిని మహమ్మద్ సబ్రీ సోలిమాన్‌గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై స్పందించిన ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్, ఇది ఉగ్రదాడిగా భావించవచ్చని స్పష్టం చేశారు. ఇప్పుడే దేశవ్యాప్తంగా భద్రతా వ్యవస్థను మరింత కఠినంగా అమలు చేస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మండే ద్రావణాలతో నిండిన సీసాలతో నిందితుడి వీడియో