USలో 3 నెలల శిశువును చంపిన పెంపుడు జంతువు
యుఎస్‌లోని అలబామాలో పెంపుడు జంతువైనా తోడేలు-హైబ్రిడ్ 3నెలల శిశువుపై దాడి చేసి చంపినట్లు షెల్బీ కౌంటీ షెరీఫ్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. చెల్సియాలోని కౌంటీ రోడ్ 440లో జరిగిన ఈదాడి పై డిప్యూటీలకు మధ్యాహ్నం 1 గంట సమయంలో అత్యవసర కాల్ వచ్చింది. పసికందును చెల్సియాలోని బర్మింగ్‌హామ్ సబర్బ్‌లోని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ తీవ్రగాయాల కారణంగా పిల్లవాడు చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు. తోడేలు-హైబ్రిడ్ అనేది తోడేలు,కుక్కల కలయికతో కూడిన కుక్క.ఈవిషయాన్ని షెల్బీ కౌంటీ కరోనర్ లీనా ఎవాన్స్ CNNకి ధృవీకరించారు. ఘటనపై విచారణ జరుగుతోందని,పోస్ట్ మార్టమ్ నిర్వహిస్తామని అధికారులు మీడియాకు తెలిపారు. ఈవిషాదకరమైన సంఘటన ఎంతో బాధించిందని అని చెల్సియా మేయర్ టోనీ పిక్లెసిమర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.