LOADING...
Pete Hegseth: అమెరికా రక్షణ మంత్రి షాకింగ్ కామెంట్స్.. ఇరాన్‌ ప్రాధేయపడితే ట్రంప్‌ దయ చూపారని వెల్లడి!
అమెరికా రక్షణ మంత్రి షాకింగ్ కామెంట్స్.. ఇరాన్‌ ప్రాధేయపడితే ట్రంప్‌ దయ చూపారని వెల్లడి!

Pete Hegseth: అమెరికా రక్షణ మంత్రి షాకింగ్ కామెంట్స్.. ఇరాన్‌ ప్రాధేయపడితే ట్రంప్‌ దయ చూపారని వెల్లడి!

వ్రాసిన వారు Moogati Shabari
Apr 08, 2026
11:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా రక్షణ మంత్రి పీట్‌ హెగ్సెత్‌ ఇరాన్‌పై "ఆపరేషన్‌ ఎఫిక్‌ ఫ్యూరీ" విజయవంతమైందని తెలిపారు. హెగ్సెత్‌ చెప్పినట్లు, ఇరాన్‌ కొత్త ప్రభుత్వం తమ సంక్షోభ పరిస్థితిని అర్థం చేసుకుని, కఠిన పరిస్థితులకంటే ఒప్పందమే ఉత్తమ మార్గమని గుర్తించిందని పేర్కొన్నారు. సమయం, ప్రత్యామ్నాయ మార్గాలు లేని కారణంగా కాల్పుల విరమణకు అంగీకరించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన తెలిపారు. అమెరికా దళాలకి నిమిషాల్లోనే దేశాన్ని నాశనం చేయగల శక్తి ఉన్నప్పటికీ, ట్రంప్‌ దయ చూపాడని హెగ్సెత్‌ వెల్లడించారు. అమెరికా షరతులను ఇరాన్‌ పూర్ణంగా అంగీకరించకపోతే, తీవ్ర దాడులు జరుగుతాయని హెగ్సెత్‌ హెచ్చరించారు. వరుస దాడుల ద్వారా ఇరాన్‌ సైన్యం లాజికల్‌గా పూర్తిగా దెబ్బతిన్నదని, ఆ దేశంలోని క్షిపణి నిల్వలను ధ్వంసం చేశారని ఆయన స్పష్టం చేశారు.

వివరాలు

వైట్ హౌస్ నుంచీ కీలక ప్రకటన

ఇకపై ఇరాన్‌ క్షిపణులు, రాకెట్లు, డ్రోన్లు వంటి ఏ రకాల ఆయుధాలను తయారు చేయలేనట్లు హెగ్సెత్‌ పేర్కొన్నారు. 47 ఏళ్ళుగా ఉన్న ఇరాన్‌తో ముప్పు ఈ సంచలన చర్యల ద్వారా తొలగిపోయిందని చెప్పారు. ఈ వ్యాఖ్యలు ఆయన వైట్‌హౌస్‌లో జరిపిన విలేకరుల సమావేశంలో చేసారు. హెగ్సెత్‌ వివరించిన ప్రకారం, మంగళవారం రాత్రి అమెరికా దళాలు ఇరాన్‌లోని 800 లక్ష్యాలపై దాడులు చేశారు. ఈ దాడుల్లో రక్షణ, అణు పారిశ్రామిక స్థావరాలు, ఫ్యాక్టరీలు లక్ష్యంగా పెట్టి ధ్వంసం చేయబడ్డాయని ఆయన తెలిపారు. ఇజ్రాయెల్‌తో సంయుక్తంగా చేపట్టిన దాడుల్లో ఇరాన్‌ సుప్రీం నేత మొజ్తాబా ఖమేనీ గాయపడ్డారని హెగ్సెత్‌ వెల్లడించారు.

Advertisement