LOADING...
Bangladesh: బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ నిషేధానికి పిటిషన్.. హైకోర్టు ఆదేశాలపై ఉత్కంఠ
బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ నిషేధానికి పిటిషన్.. హైకోర్టు ఆదేశాలపై ఉత్కంఠ

Bangladesh: బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ నిషేధానికి పిటిషన్.. హైకోర్టు ఆదేశాలపై ఉత్కంఠ

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 27, 2024
02:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

బంగ్లాదేశ్‌లో ఇస్కాన్‌కు చెందిన చిన్మయ్‌ కృష్ణదాస్‌ ప్రభును బంగ్లాదేశ్‌ జెండాను అవమానపరిచారనే ఆరోపణలతో ఢాకా విమానాశ్రయంలో అరెస్టు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై హిందువులు భారీ ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇస్కాన్‌ సంస్థను నిషేధించాలని బంగ్లాదేశ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైనట్లు తెలుస్తోంది. ఇస్కాన్‌ కార్యకలాపాలపై బంగ్లాదేశ్‌ హైకోర్టు దృష్టి సారించగా, దేశంలో శాంతి భద్రతల పరిస్థితిపై గురువారం ఉదయానికి నివేదిక ఇవ్వాలని అటార్నీ జనరల్‌కు ఆదేశాలిచ్చింది. ఉద్రిక్తతలు పెరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని పేర్కొంది.

Details

చిన్నయ్ ను అరెస్టు చేసిన పోలీసులు

బంగ్లాదేశ్‌ మీడియా కథనాల ప్రకారం, చిన్మయ్‌ కృష్ణదాస్‌ గత నెలలో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొని బంగ్లాదేశ్‌ జెండా పట్ల వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలొచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయనను ఢాకా విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక చిన్మయ్‌ అరెస్టును వ్యతిరేకిస్తూ హిందువులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఇప్పటికే మైనారిటీలపై దాడులు జరగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఇస్కాన్‌ కార్యకలాపాలు, చిన్మయ్‌ కృష్ణదాస్‌పై ఆరోపణల నేపథ్యంలో, బంగ్లాదేశ్‌లో మత సామరస్యాన్ని కాపాడేందుకు ప్రయత్నించాలని మతపరమైన సంఘాలు కోరాయి.