Pakistan: పాకిస్థాన్'లో ఇంధన సంక్షోభం తీవ్రం.. కార్లకు బ్రేక్, గాడిద బండ్లకు గ్రీన్ సిగ్నల్
ఈ వార్తాకథనం ఏంటి
పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకడంతో పాకిస్థాన్‌లో పరిస్థితి రోజురోజుకీ దారుణంగా మారుతోంది. ఇంధనం కోసం ప్రజలు పెట్రోల్ బంకుల వద్ద గంటలకొద్దీ క్యూల్లో నిల్చున్నా, చివరికి "స్టాక్ లేదు" అన్న బోర్డు చూసి నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఒకప్పుడు క్రికెట్‌కే ఊపిరిగా ఉన్న పాకిస్థాన్‌లో, ఇప్పుడు ప్రజలు పెట్రోల్ మీటర్‌నే చూసుకుంటూ రోజులు గడుపుతున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగడంతో వాహనాలు నడపడం లగ్జరీగా మారింది. ఇక కార్‌పూలింగ్, బైక్‌పై ముగ్గురు నలుగురు ప్రయాణించడం సాధారణమైపోయింది. ఇదే సమయంలో దేశంలో కేవలం 5 నుంచి 7 రోజుల ఇంధన నిల్వలే ఉన్నాయని మంత్రి అలీ పర్వైజ్ మాలిక్ చెప్పడం మరింత ఆందోళన కలిగిస్తోంది.
వివరాలు
కుదేలైన ఆర్థిక పరిస్థితి
భారత్‌లా రిజర్వులు లేవని ప్రభుత్వం అంగీకరించింది. మరోవైపు ఐఎంఎఫ్ షరతులు కారణంగా ఆర్థిక పరిస్థితి కుదేలైందని అధికారులు చెబుతున్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో రూపాయి విలువ పడిపోగా, ప్రజల జీవనం కష్టమైంది. పెట్రోల్ కొనే స్థోమత లేకపోవడంతో సైకిళ్లు, గాడిద బండ్లు మళ్లీ ప్రాధాన్యం పొందుతున్నాయి. రోడ్లపై కార్ల కంటే సైకిళ్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇలా పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ పాత కాలానికి వెనక్కి వెళ్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.