South Korea Air Force: పైలట్ సెల్ఫీతో ఆకాశంలో ఢీకొన్న యుద్ధ విమానాలు.. క్షమాపణలు తెలిపిన దక్షిణ కొరియా వాయుసేన
ఈ వార్తాకథనం ఏంటి
దక్షిణ కొరియా వాయుసేనలో షాకింగ్ నిజం వెలుగులోకి వచ్చింది. 2021లో రెండు యుద్ధ విమానాలు గాల్లో ఢీకొన్న ఘటనకు పైలట్ల నిర్లక్ష్యమే కారణమని అధికారులు స్పష్టం చేశారు. విమాన ప్రయాణ సమయంలో సెల్ఫీలు తీసుకుంటూ, వీడియోలు చిత్రీకరిస్తూ నియమాలు ఉల్లంఘించారని ఆడిట్ నివేదికలో తేలింది. ముఖ్యంగా ఒక పైలట్ చివరి ఫ్లైట్ గుర్తుగా ఫొటోలు తీసేందుకు అనుమతి లేకుండా విమానాన్ని అకస్మాత్తుగా ఎత్తుకు తీసుకెళ్లి, ప్రమాదకరంగా మలుపులు తిప్పడంతో ఈ ఘటన జరిగింది.
వివరాలు
8.8 కోట్ల వోన్ నష్టం
దీంతో రెండు ఎఫ్-15కే విమానాలు దగ్గరగా వచ్చి ఒకదానికొకటి తాకాయి. ఈ ఘటనలో సుమారు 8.8 కోట్ల వోన్ నష్టం జరిగినప్పటికీ, ఎవరూ గాయపడలేదు. బాధ్యుడైన పైలట్‌పై కఠిన చర్యలు తీసుకున్నామని, ఇప్పటికే అతను వాయుసేన సేవల నుంచి తప్పుకున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించింది.