LOADING...
Felix Baumgartner: ఇటలీలో పారాగ్లైడింగ్ చేస్తూ స్కైడైవర్ ఫెలిక్స్ బామ్‌గార్ట్‌నర్ మృతి 
ఇటలీలో పారాగ్లైడింగ్ చేస్తూ స్కైడైవర్ ఫెలిక్స్ బామ్‌గార్ట్‌నర్ మృతి

Felix Baumgartner: ఇటలీలో పారాగ్లైడింగ్ చేస్తూ స్కైడైవర్ ఫెలిక్స్ బామ్‌గార్ట్‌నర్ మృతి 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 18, 2025
11:20 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రఖ్యాత డేర్‌డెవిల్ స్టంట్ క్రియేటర్, ఆస్ట్రియా‌కు చెందిన స్కైడైవర్ ఫెలిక్స్ బామ్‌గార్ట్నర్ (Felix Baumgartner) అనూహ్య రీతిలో ప్రాణాలు కోల్పోయాడు. 56 సంవత్సరాల వయస్సున్న అతను పారాగ్లైడింగ్ చేస్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. 2012లో స్ట్రాటోస్పియ‌ర్ నుంచి దూకిన అత‌ను ప్ర‌పంచ రికార్డు నెల‌కొల్పాడు. అయితే తాజాగా ఇటలీ తీర ప్రాంతంలో పారాగ్లైడింగ్ చేస్తున్న సమయంలో మృతిచెందినట్లు సమాచారం. అతను ఏ కారణం వల్ల ప్రాణాలు కోల్పోయాడో స్పష్టత లేదు. అడ్రియాటిక్ కోస్ట్ వద్ద అతను ప్రమాదానికి గురయ్యినట్టు తెలుస్తోంది. పారాగ్లైడింగ్ నిర్వహణలో నియంత్రణ కోల్పోవడం వల్లే ఈ ప్రమాదం సంభవించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.

వివరాలు 

బామ్‌గార్ట్నర్‌కు స్కైడైవింగ్‌లో ప్రత్యేక నైపుణ్యం

పోర్టో సాంట్ ఎల్పిడో ప్రాంతంలోని ఓ హాలీడే రెసిడెన్స్‌లో ఉన్న స్విమ్మింగ్ పూల్‌లో అతను పడిపోయినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఓ మహిళ కూడా గాయపడినట్టు సమాచారం. ఫెలిక్స్ బామ్‌గార్ట్నర్‌కు స్కైడైవింగ్‌లో ప్రత్యేక నైపుణ్యం ఉంది. 2012లో ఓ ప్రత్యేక క్యాప్సూల్ నుంచి స్ట్రాటోస్పియర్ ఎత్తులో నుంచి భూమిని లక్ష్యంగా చేసుకొని దూకాడు. భూమికి సుమారు 39 కిలోమీటర్ల ఎత్తు నుంచి చేసిన ఆ డైవ్‌తో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

స్ట్రాటోస్పియ‌ర్ నుంచి దూకుతున్న ఫెలిక్స్ బామ్‌గార్ట్‌నర్