LOADING...
Hong Kong: హాంకాంగ్‌లో రన్‌వే నుంచి జారిపడిన కార్గో విమానం.. ఇద్దరు మృతి 
హాంకాంగ్‌లో రన్‌వే నుంచి జారిపడిన కార్గో విమానం.. ఇద్దరు మృతి

Hong Kong: హాంకాంగ్‌లో రన్‌వే నుంచి జారిపడిన కార్గో విమానం.. ఇద్దరు మృతి 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 20, 2025
08:43 am

ఈ వార్తాకథనం ఏంటి

హాంకాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం తెల్లవారుజామున ఒక కార్గో విమానం రన్‌వేను దాటి సముద్రంలో పడిపోయిన సంఘటన కలకలం రేపింది. ఈప్రమాదంలో ఇద్దరు విమానాశ్రయ గ్రౌండ్ సిబ్బంది దుర్మరణం పాలయ్యారు. అయితే విమానంలో ఉన్న నలుగురు సిబ్బంది సురక్షితంగా బయటపడినట్లు అధికారులు తెలిపారు. స్థానిక మీడియా ప్రకారం,ప్రమాదానికి గురైన విమానం టర్కీకి చెందిన ACTఎయిర్‌లైన్‌ది. ఈ విమానం ఎమిరేట్స్ EK9788అనే ఫ్లైట్ నంబర్‌తో దుబాయ్‌ నుంచి హాంకాంగ్‌కు చేరుకుంది. బోయింగ్ 747-481మోడల్‌కు చెందిన ఈ కార్గో విమానం స్థానిక సమయం ప్రకారం ఉదయం 3:50 గంటలకు ల్యాండింగ్ చేసేటప్పుడు రన్‌వేపై ఉన్న వాహనాన్ని ఢీకొని నియంత్రణ కోల్పోయింది. ఆ తర్వాత రన్‌వే చివర నుంచి సముద్రంలోకి జారిపోయినట్లు సమాచారం.

వివరాలు 

 సముద్రంలో పడిపోయిన ఇద్దరు గ్రౌండ్ సిబ్బంది

సివిల్ ఏవియేషన్ శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం,ఆ వాహనంలో పనిచేస్తున్న ఇద్దరు గ్రౌండ్ సిబ్బంది తీవ్ర గాయాలతో సముద్రంలో పడిపోయారు. వారిని తక్షణమే రక్షించి ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ మృతి చెందారు. విమాన సిబ్బంది నలుగురిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చి ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నారని అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన రన్‌వేను తాత్కాలికంగా మూసివేయగా, మిగతా రెండు రన్‌వేలు సాధారణంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి.

వివరాలు 

 11 కార్గో విమానాల షెడ్యూల్‌ల రద్దు 

రక్షణ చర్యల కోసం హాంకాంగ్ ప్రభుత్వం హెలికాప్టర్లు, అగ్నిమాపక నౌకలు, అత్యవసర బృందాలను సంఘటన స్థలానికి పంపింది. ఈ ప్రమాదం కారణంగా కనీసం 11 కార్గో విమానాల షెడ్యూల్‌లను రద్దు చేసినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. భద్రతా పరంగా అత్యుత్తమ రికార్డ్ కలిగిన హాంకాంగ్ విమానాశ్రయంలో ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా చోటుచేసుకుంటాయని పేర్కొన్నారు. ఈ ఘటనపై ఎమిరేట్స్ ఎయిర్‌లైన్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ప్రమాదంలో ఇద్దరు విమానాశ్రయ గ్రౌండ్ సిబ్బంది దుర్మరణం